ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ స్పైస్‌జెట్.. 1,400 మంది ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది.

  • ఖర్చులు త‌గ్గించుకోవ‌డానికి 15 శాతం
  • సిబ్బందిని త‌గ్గించుకుంటున్నసంస్థ‌

విధాత‌: ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ స్పైస్‌జెట్.. 1,400 మంది ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డం, పెట్టుబడిదారులను ఆక‌ర్షించే చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంస్థ వెల్ల‌డించింది. ప్రస్తుత ప‌నిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 15 శాతం మందిని తొల‌గించనున్న‌ట్టు బడ్జెట్ క్యారియర్ తెలిపింది.

2019లో గరిష్ట స్థాయిలో స్పైస్‌జెట్‌లో 118 విమానాలు, 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. స్పైస్‌జెట్ జీతం బిల్లు రూ.60 కోట్ల వ‌ర‌కు ఉంటున్న‌ది. ఆ సంస్థ 'చాలా నెలలు' జీతం పెండింగ్‌లో ఉంటున్న‌ది. చాలా మంది సిబ్బందికి జనవరి నెల జీతాలు ఇంకా చెల్లించలేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


సిబ్బందికి వేత‌నాలు పెండింగ్‌లో లేవ‌ని, రూ.2,200 కోట్ల పెట్టుబ‌డులు పొందే ప్రక్రియ జ‌రుపుతున్న‌ట్టు స్పైస్‌జెట్ తెలిపింది. ప్రస్తుతం, స్పైస్‌జెట్ 30 విమానాలను నడుపుతున్న‌ది. 9000 మంది సిబ్బంది ప‌నిచేస్తున్నారు. ప్రస్తుతం, బడ్జెట్ క్యారియర్ దాదాపు 4% మార్కెట్ వాటాను కలిగి ఉంది.

Updated On 12 Feb 2024 9:11 AM GMT
Somu

Somu

Next Story