బీజేపీకి షాకిచ్చిన ఉత్తరప్రదేశ్ ఓటర్లు.. 42 చోట్ల లీడ్‌లో ఇండియా కూటమి
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. యూపీ వ్యాప్తంగా బీజేపీ వెనుకంజలో కొనసాగుతోంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి 42 స్థానాలకు పైగా ముందంజలో ఉన్నారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. యూపీ వ్యాప్తంగా బీజేపీ వెనుకంజలో కొనసాగుతోంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి 42 స్థానాలకు పైగా ముందంజలో ఉన్నారు. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో.. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎస్పీ సుమారు 30కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. బీజేపీతో కలిసి సమాజ్‌వాదీ .. పోటాపోటీగా ఫలితాల్లో పోటీపడుతున్నది. బీజేపీ ప్రస్తుతం 40 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది.
తొలి రౌండ్లో వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉండడం గమనార్హం. అక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ముందంలో ఉన్నారు. యూపీలో ఈసారి బీజేపీ 75 స్థానాల్లో పోటీ చేసింది. 5 సీట్లను కూటమి పార్టీలకు ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 17, తృణమూల్ ఒక సీటులో పోటీ చేసింది.