Viral Video: ఇదెక్క‌డి పామురా.. జెట్ స్పీడ్‌లో చెట్టెక్కింది! స్ప్రింగులేమైనా మింగిందా

  • By: sr    news    Jun 28, 2025 8:31 PM IST
Viral Video: ఇదెక్క‌డి పామురా.. జెట్ స్పీడ్‌లో చెట్టెక్కింది! స్ప్రింగులేమైనా మింగిందా

Snake | python

విధాత: పాములలో రకరకాల జీవనశైలి…ఆకార నిర్మాణాలు కల్గి ఉండటం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఓ పాము చెట్టుపైకి ఎక్కడంలో మిగతా పాములతో పోల్చితే విభిన్నంగా ఉండటం విస్మయం కల్గిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారికి ప్రపంచంలో ఇలాంటి పాములు కూడా ఉన్నాయా అన్న ఆశ్చర్యం కల‌గ‌క మానదు. చెట్టు పైకి ఎక్కడంలో ఆ పాము గీత కార్మికుల మాదిరిగా తన శరీరాన్ని ఉపయోగిస్తుంది.

తాటి చెట్టుపైకి ఎక్కేందుకు గీత కార్మికులు ఎలాగైతే మోకు ముస్తాద్ వినియోగించి ఎక్కుతారో అచ్చం అలాగే ఆ పాము కూడా తన శరీరాన్ని చెట్టుకు చుట్టలా చుట్టి క్రమంగా పైకి ఎగ బాకుతుంది. నిటారుగా ఉన్న చెట్టును ఎక్కే క్రమంలో పడిపోకుండా సురక్షితంగా చెట్టుపైకి ఎక్కేందుకు ఆ పాము తన శరీరాన్ని తెలివిగా ఉపయోగించుకున్న తీరు దాని తెలివికి..మేథస్సుకు నిదర్శనంగా కనిపించింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భగవంతుడు ప్రతి ప్రాణికి దాని మనుగడ కోసం ఏదో ఒక ప్రత్యేకతను ఇచ్చాడని..ఈ పాముకు చెట్టు ఎక్కడంలో కూడా అలాంటి ప్రత్యేక తెలివిని ప్రసాదించాడని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం తాటి, కొబ్బరి చెట్లను ఎలా ఎక్కాలో ఈ పాముకు తెలిసినంతగా మరెవరికి తెలియంటు కామెంట్లు పెట్టారు.