MP | ర‌క్షించండి మ‌హా ప్ర‌భో.. భార్య చావ కొడుతోంది! పోలీసులను ఆశ్రయించిన భర్త!

  • By: sr    news    Apr 02, 2025 4:33 PM IST
MP | ర‌క్షించండి మ‌హా ప్ర‌భో.. భార్య చావ కొడుతోంది! పోలీసులను ఆశ్రయించిన భర్త!

MP | PANNA

విధాత: ఇటీవల కాలంలో భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. భర్తలు చావ బాదుతున్నారన్న ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్లకు వచ్చే భార్యలకు తీసిపోకుండా భార్య బాధితులు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో భార్య బాధితులు ఎక్కువగా ఉంటుండటం చూస్తున్నాం. భారత్ వంటి దేశాల్లో హత్యా ఘటనలలో 58శాతం వివాహ బంధంతో ముడిపడినట్లుగా..అందులో 42శాతం ఘటనల్లో పురుషులే బాధితులుగా ఉన్నారని ఐరాస నివేదికలు వెల్లడించడం గమనార్హం. భారత్ లో ఏటా 275మంది భర్తలు, 225మంది భార్యలు తమ జీవిత భాగస్వాముల చేతుల్లో హతమవుతున్నట్లుగా ఆ నివేదికలు తెలిపాయి.

కాగా మధ్యప్రదేశ్ పన్నాలో ఓ భార్య కట్టుకున్న భర్తను కనికరం లేకుండా కొడుతున్న ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పన్నాకు చెందిన లోకేష్ తన భార్య తనను కొట్టిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అవాక్కయ్యారు. లోకేష్ ను అతడి భార్య కొట్టడటం సీసీ టీవీలో చూసిన పోలీసులు సైతం వామ్మో ఇదెక్కడి గయ్యాలి పెళ్లాంరా బాబు అనుకుని విస్మయం చెందారు. భర్త లోకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో దిగివచ్చిన లోకేష్ భార్య తనను క్షమించాలని మీడియా ముందు అతడిని వేడుకుంది. తన తప్పును అంగీకరించి ఇకపై భర్తను కొట్టబోనని హామీ ఇచ్చింది.