Sonakshi Sinha:పెళ్లి త‌ర్వాత‌.. డోస్ పెంచుతోందిగా

  • By: sr    news    Jan 05, 2025 9:10 PM IST
Sonakshi Sinha:పెళ్లి త‌ర్వాత‌.. డోస్ పెంచుతోందిగా

గ‌త‌ ఏడాది జూన్‌లో న‌టుడు జ‌హీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది బాలీవుడ్ రెబ‌ల్ స్టార్ శ‌తృఘ్న సిన్హా కూతురు, న‌టి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha).

ఇత‌ర మ‌త‌స్తున్నిపెళ్లి చేసుకోవ‌డంతో త‌రుచూ వివాదాలు ఎదుర్కొంటున్న ఈ జంట నాలుగైదు నెల‌లుగా ఏదోర‌కంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాన వార్త‌గా ఉంటూ వ‌స్తున్నారు.

విహార యాత్రలు అంటూ రోజుకో దేశం తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్క‌డి అంద‌మైన ప్రదేశాల‌తో పాటు బీచ్‌ల‌లో సేద తీరుతున్న ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తు ట్రెండింగ్‌లో ఉంటున్నారు.

సినిమాల్లో ప‌ద్ద‌తిగా, ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌లు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్రామ‌ర్ డోస్ పెంచి భ‌ర్త‌తో క‌లిసి జ‌ల్సాలు చేస్తుండ‌డంతో ఆ వీడియోలు, ఫొటోలు చూసిన అభిమానులు షాక‌వుతున్నారు.

తాజాగా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా వీదేశాల్లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో పాల్గొని హంగామా చేశారు. అయితే దీపావ‌ళి స‌మ‌యంలో బాంబులు పేల్చి పొల్యుష‌న్ జ‌రుగుతుంద‌ని, వాతావ‌ర‌ణం అంతా కాలుష్యం చేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసింది.

తీరా నూత‌న సంవ‌త్స‌రం వేళ బ‌య‌ట ఉన్న ఈ జంట అక్క‌డ ఫైర్ క్రాక‌ర్స్ కాల్చ‌డం ఎంజాయ్ చేశారు. దీంతో నెటిజ‌న్లు త‌మ చేతికి ప‌ని చెప్పి త‌మ ఇష్టారీతిన ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.