BRS రజోతోత్సవ సభ పాటను ఆవిష్కరించిన కేసీఆర్!

  • By: sr    news    Apr 03, 2025 6:31 PM IST
BRS రజోతోత్సవ సభ పాటను ఆవిష్కరించిన కేసీఆర్!

విధాత : వరంగల్ లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పాటను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం ఆవిష్కరించారు. రచయిత, గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాసి, పాడిన ‘బండెనక బండి కట్టి గులాబీల జెండ పట్టి..పాటను కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం నుంచి నేటి వరకు పార్టీ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాల్ని రూపొందించాలని రసమయికి సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.