Lady Aghori | తెలంగాణలో.. అఘోరీపై కేసు నమోదు

విధాత: లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి తనను మోసం చేసినట్లు అఘోరీపై మోకిలా పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. పూజల పేరుతో రూ 9.8 లక్షలు తీసుకుని తనను మోసం చేసినట్లు అఘోరీపై బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కోంది. బాధితురాలు వినీత ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు లేడీ అఘోరీపై కేసు నమోదు చేశారు.
మొదటి భార్య ఆరోపణలు అబద్దం: లేడీ అఘోరీ
తనను మొదటి భార్యగా పెళ్లి చేసుకున్నానంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు అంతా అబద్దమని లేడీ అఘోరీ ఖండించింది. రాధిక అనే మహిళ న్యాయవాదిగా పనిచేస్తున్నారని, ఆమె భర్త వదిలివేయడంతో తను డిప్రెషన్ లో ఉన్నానని చెప్పి నన్ను కాపాడమని అడిగిందని అఘోరీ వివరించారు. ఆ సందర్భంగా ఆమెను ఓదార్చే క్రమంలో ప్రేమగా మాట్లాడానని, లవ్ యూ, మిస్ యూ అనేవి నేను అందరితో ప్రేమగా మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు.
ఇన్ని రోజులు లేనిది నేను శ్రీ వర్షిణిని పెళ్లి చేసుకున్నా అనంతరం ఇప్పుడే ఎందుకు మీడియా ముందుకు వచ్చిందని ప్రశ్నించారు. నా ఆడియో రికార్డింగ్ ఒక్కటే కాదు.. ఆమె మాట్లాడిన రికార్డింగులు కూడా బయటపెట్టాలని అఘోరీ డిమాండ్ చేసింది. రాధిక అనే మహిళనే నన్ను పెళ్లి చేసుకుంటానని వెంట పడిందన్నారు. ఆ సందర్భంగా ఆశ్రమం ఏర్పాటుకు భూమి కోసం కొంత డబ్బులు ఇచ్చానని…అవి తిరిగి తన ఖాతాలో వేసిందని..వాటన్నింటిని బయట పెడితే వాస్తవాలు అందరికి తెలుస్తాయని అఘోరీ స్పష్టం చేశారు.