Hyderabad | ఒరిగిద్దిరో.. జర చుస్కోబళ్ళా? జాకీలతో.. ఇంటిని పైకి లేపబోతే ఒరిగిపోయింది
Hyderabad | విధాత: రేటింగ్ లేని సినిమాలను పబ్లిసిటీతో పైకి లేపుతుంటారు.. విషయం లేని నాయకుడిని మీడియాతో పైకి లేపుతుంటారు. నాణ్యత లేని సరుకును ఊదరగొట్టి బలవంతాన జాకీలతో పైకి లేపుతుంటారు. అలాగే పాపం హైదరాబాద్ చింతల్‌లో ఒక పెద్దాయన తన ఇంటిని పైకి లేపే ప్రయత్నంలో ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. తనోటి తలిస్తే దైవమొకలి తలుస్తాడన్న చందంగా తయారైంది. అప్పుడెప్పుడో కట్టేసిన ఇల్లు ఇప్పుడు రోడ్డు లెవెల్ కన్నా కిందికి అయిపొయింది. వర్షాలు వస్తే వాననీరు కింది […]

Hyderabad |
విధాత: రేటింగ్ లేని సినిమాలను పబ్లిసిటీతో పైకి లేపుతుంటారు.. విషయం లేని నాయకుడిని మీడియాతో పైకి లేపుతుంటారు. నాణ్యత లేని సరుకును ఊదరగొట్టి బలవంతాన జాకీలతో పైకి లేపుతుంటారు. అలాగే పాపం హైదరాబాద్ చింతల్‌లో ఒక పెద్దాయన తన ఇంటిని పైకి లేపే ప్రయత్నంలో ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. తనోటి తలిస్తే దైవమొకలి తలుస్తాడన్న చందంగా తయారైంది.
అప్పుడెప్పుడో కట్టేసిన ఇల్లు ఇప్పుడు రోడ్డు లెవెల్ కన్నా కిందికి అయిపొయింది. వర్షాలు వస్తే వాననీరు కింది పోర్షన్ లోకి వెళ్తున్నాయి ఎలా అని ఆలోచించి ఫర్లేదు మనోళ్లకు చెబితే దాన్ని ఓ రెండు అడుగులు పైకి లేపుతారులే.. లారీలు కార్లకు జాకీలు పెట్టి లేపినట్లే లేపుతారని ఎవరో చెబితే ఒకే ప్రొసీడ్ అని జాకీలకు ఆర్డర్ ఇచ్చాడు. కొందరేమో అన్నా అలా లేవదు.. అది చాలా ప్రమాదం ఒరిగిపోతుందన్నారు. అయినా వినలేదు.. లేపాల్సిందే అని అడ్వాన్స్ ఇచ్చాడు.
ఇంజినీరు వచ్చి ఇంటి చుట్టూ తిరిగి సర్లే అని తన తెలివి, టెక్నలాజీ వాడి దాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేసారు. ఎత్తితే ఎత్తాడు కానీ కనీసం ఇళ్లలో ఉన్న మనుషులను సైతం అలాగే ఉంచి పైకి లేపబోయాడు. కాసేపు బానే అనిపించింది. లేస్తున్నట్లే ఉంది.. భలే భలే అనుకున్నారు.. ఇంకాస్త పైకి లేవగానే అది సైడుకు ఒరిగింది.
ఇంకేముంది. మొత్తం నాలుగు పోర్షన్లలో ఉన్న జనాలు భూకంపం వచ్చినట్లు భయంతో వణికిపోయారు. ఒరిగినదాన్ని మళ్ళీ ఉన్న చోట కూచోబెట్టడం సులువు కాదు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఇదెక్కడి ప్రమాదం. ఎవరి మీదైనా పడుతుందేమో అని గోల చేశారు. ఈలోపు GHMC వాళ్ళు వచ్చి.. ఇక కష్టమే దాన్ని కూల్చేయాలి అని చెప్పడంతో.. అయ్యో రామ అని అయన బావురుమంటున్నాడు.
ఇక చేసేదేమీ లేక GHMC అధికారుల ఆదేశాల మేరకు ఇండ్లలోని వారందరినీ కాళీ చేయించి ఆ మొత్తం ఇంటిని కూలగొట్టేశారు.