సంక్షేమ హాస్టల్స్ కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చండి
సంక్షేమ హాస్టల్స్ కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చండి ప్రాణాలు కాపాడండి ఒక్కొక్క నియోజకవర్గంలో 6 నుంచి 8 వసతి గృహాలు ఒక్కొక్క హాస్టల్ లో 100 మందికి అవకాశం ప్రైవేట్ భవనాలను ఖాళీగా ఉంచి లక్షల్లో అద్దె కట్టడం నిధుల దుర్వినియోగం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు బెడ్లు లేవని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతియ్ నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలను కోవిడ్ కేర్ కేంద్రాలుగా వినియోగిస్తే కోవిడ్ మరణాలు సంఖ్యను తగ్గించడానికి […]

సంక్షేమ హాస్టల్స్ కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చండి ప్రాణాలు కాపాడండి
ఒక్కొక్క నియోజకవర్గంలో 6 నుంచి 8 వసతి గృహాలు
ఒక్కొక్క హాస్టల్ లో 100 మందికి అవకాశం
ప్రైవేట్ భవనాలను ఖాళీగా ఉంచి లక్షల్లో అద్దె కట్టడం నిధుల దుర్వినియోగం
ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు బెడ్లు లేవని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతియ్ నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలను కోవిడ్ కేర్ కేంద్రాలుగా వినియోగిస్తే కోవిడ్ మరణాలు సంఖ్యను తగ్గించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని సంక్షేమ వసతి గృహాలు ఖాళీగా ఉన్నాయి.
ఒక్కొక్క వసతి గృహంలో 100 మందికి వసతి సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని వసతి గృహాల్లో బెడ్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. స్థానికంగా ఉన్న వైద్య సిబ్బందిని వినియోగించి ఆయా కేంద్రాలలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించవచ్చు. అలాగే రోగులకు అక్కడే భోజన సౌకర్యాలు కూడా కల్పించడానికి వీలుగా ఉంటుంది. ఒక్కొక హాస్టల్ లో ఒక సంక్షేమ అధికారితో పాటు ముగ్గురు ఔట్ సోర్సింగ్ వర్క్స్ ఉన్నారు. వైద్య సేవలు స్ధానిక ఆరోగ్య సిబ్బంది చూసుకుంటే, వారికి కావలసిన భోజనాలు సంక్షేమ సిబ్బంది చూసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎక్కడికక్కడ కోవిడ్ రోగులకు సునాయాసంగా చికిత్స అందించి వారిని వచ్చు.
ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 6 నుంచి 8 పైనే వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రైవేట్ భవనాలు. ప్రైవేటు భవనాలకు ఖాళీగా ఉంచి అద్దెలు చెల్లించి ఖజానాకు గండి కలిగించే బదులు కోవిడ్ కేర్ సెంటర్స్ గా మార్చి నిధులు దుర్వినియోగం కాకుండా స్థానికంగా ఉండే కోవిడ్ రోగులకు చికిత్స ఇచ్చి ప్రాణాలు కాపడవచ్చు.
ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుని కోవిడ్ రోగులను కాపాడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.