క‌రోనా మూడో వేవ్ రాదు..ఎందుకో చెబుతున్న వాసిరెడ్డి అమ‌ర్నాథ్‌

భిన్నాభిప్రాయం సహజం .. కానీ …మూడో వేవ్ వస్తుందా ? దీని పై రెండు లేదా మూడు అభిప్రాయాలు ఉన్నాయి. 1 . రాదు . 2 . వస్తుంది . 3 . చెప్పలేము . విధాత:నేను రాదు అని నమ్ముతున్నా. అదే విషయాన్ని పోస్ట్ చేస్తున్నా. కొంతమంది ఫేస్బుక్ పై మిత్రులు లేదు వస్తుంది అనో లేదా చెప్పలేము అనో అంటున్నారు . నేను బిన్నాభిప్రాయాన్ని గౌరవిస్తాను . నా మాటే సరైంది అని […]

క‌రోనా మూడో వేవ్ రాదు..ఎందుకో చెబుతున్న వాసిరెడ్డి అమ‌ర్నాథ్‌

భిన్నాభిప్రాయం సహజం .. కానీ …
మూడో వేవ్ వస్తుందా ? దీని పై రెండు లేదా మూడు అభిప్రాయాలు ఉన్నాయి. 1 . రాదు . 2 . వస్తుంది . 3 . చెప్పలేము .

విధాత:నేను రాదు అని నమ్ముతున్నా. అదే విషయాన్ని పోస్ట్ చేస్తున్నా. కొంతమంది ఫేస్బుక్ పై మిత్రులు లేదు వస్తుంది అనో లేదా చెప్పలేము అనో అంటున్నారు . నేను బిన్నాభిప్రాయాన్ని గౌరవిస్తాను . నా మాటే సరైంది అని వాదించను.
రాదు అని ఎలా చేబుతున్నాను ? ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటికి దేశం లో కనీసం అరవై శాతం మందికి కరోనా సోకింది . కొన్ని నగరాల్లో ఇది డెబ్భై దాటింది . { ఉదాహరణ : అహమ్మదాబాద్ } .దీని కి తోడు ఇప్పటికి 15 శాతం జనాభా వాక్సిన్ వేసుకొన్నారు . మరో రెండు నెలల్లో ఇది కనీసం నలబై శాతానికి చేరుకొంటుంది . అంటే ఆగష్టు నాటికి సోకకుండా లేదా వాక్సిన్ వేసుకోకుండా మిగిలి వారు పెద్దగా వుండరు . ఇలాంటి స్థితి లో ఇక కరోనా ఎలా సోకుతుంది ? సోకినా ఎక్కడో వందల మందికి అంతే కానీ లక్షల మంది కరోనా బారిన పడి వేవ్ లు వచ్చే స్థితి ఎక్కడ ? ఇదీ నా లాజిక్ .
ఒకటో వేవ్ లో సోకని వారికి రెండో వేవ్ లో సోకింది . మాస్క్ పెట్టుకొన్న వారికి, నెలల తరబడి ఇంటిపట్టునే ఉంటున్న వారికి కూడా సోకింది . తప్పు మాస్కు ది కాదు . మాస్క్ పెట్టుకోవద్దు అని దీని అర్థం కాదు . ఇరవై నాలుగు గంటలు మాస్క్ పెట్టుకోవడం సాధ్యం కాదు . ఇంటిపట్టునే ఉండినా గాలి ద్వారా టాయిలెట్ ద్వారా ఇంకా ఇతర పద్ధతుల్లో కరోనా సోకిన వారు వున్నారు . మన దేశం లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే డెబ్భై లక్షల మందికి కరోనా సోకింది . మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇంటి వద్దే ఉండి పోవడం వల్ల కరోనా సోకకుండా వుండేటట్టు అయితే ఇంతమందికి సోకదు . మళ్ళ్లీ మళ్ళీ చెబుతున్నా.. తప్పు మాస్క్ ది లేదా స్టే హోమ్ పద్దతి ది కాదు . అది ఆచరణ లో అసాధ్యము . ఇరవై మూడు గంటలు డబల్ మాస్క్ పెట్టుకున్నా బాత్రూం లో బ్రష్ చేసుకోవడానికో స్నానం చేయడానికో తీస్తారు కదా . వైరస్ శరీరం లో ప్రవేశించడానికి అయిదు సెకండ్స్ చాలు .
కాబట్టి నేను ఏమి చెబుతున్నా? . ఎండ – డి విటమిన్ .

శాకాహాహారులు – b12 విటమిన్ ; ప్రోటీన్ – చికెన్ , ఎగ్ , మొలకెత్తిన విత్తనాలు , పన్నీర్ . ఇంకా ఆకుకూరలు , కాయగూరలు , డ్రై ఫ్రూట్స్ , వ్యాయామం . భయం లేకుండా ఉండడం . జన సమర్ధం ఉన్న ప్రాంతాల్లో మాస్క్ . ఇది నిజమైన రక్షణ . ఇంటివద్దే ఉంటే బతుకు సాగదు. ఒక వేళా డబ్బు ఉన్నా, అదే పనిగా నెలల తరబడి ఇంటివద్దే ఉండి పోవాలి వస్తే అది మానసికంగా దెబ్బతీస్తుంది . డెబ్భై శాతానికి సోకడం , ఇంకో ముప్పయ్ నలబై శాతానికి వాక్సిన్ .. ఈ వాక్సిన్ వేసుకొన్న వారి సంఖ్యా పెరుగుతూనే ఉంటుంది .. ఇలాంటి స్థితిలోనే కరోనా సోకితే .. వేవ్ లు వస్తే .. ఇక చేసేది ఏముంటుంది ? దాని అర్థం ఇక జీవితాంతం వేవ్ లే .. అప్పుడు మన వద్దను కొన్నా ప్రభుత్వాలు లాక్ డౌన్ లు పెడుతాయి . నలుగురితో నారాయణ ..ఇప్పటికే బతుకులు చితికి పోయాయి . సర్వ నాశనం తప్పదు . సమస్య లాక్ డౌన్ ల తోనే కానీ కరోనా తో కాదు అని నా అభిప్రాయం . ఇప్పటికి కొని లక్షల మంది నేను చెప్పిన పద్దతిలో కరోనా నుంచి కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు . అంటే సోక లేదా అంటే ఎలా సోక కుండా ఉంటుంది ? ముక్కున్న వాడికి సోకకక మానదు .. అనివార్యమగు ఈ క్రయము గురించి చింతింప తగదు అని నేను ఎన్నో సార్లు చెప్పాను. సోకినా శోకం ఉండదు .

అంటే పైన నేను పేర్కొన్న పద్దతిలో అసలు మరణాలు జరగవా ? అదే చెబుతున్నా. లక్షల మంది ఫాలో అయ్యారు . ఎవరికీ ఏమీ కాలేదు . సోకినా కోలుకున్నారు . అలాగని అందరికీ కాదు . ఉదాహరణ కు మా అమ్మ నే తీసుకొందాము. ఆమె రెండు డోస్ ల వాక్సిన్ వేసుకొంది. నేను చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తోంది . అయినా సరి పోదు . మొన్న ఫోన్ చేసి జులై మొదటి వారం హైదరాబాద్ కు వస్తాను అంది . ఇప్పుడే వద్దు కేసులు ఇంకా వున్నాయి . అంత క్షేమం కాదు . ఎప్పుడు రావాలో నేను చెబుతాను అన్నాను . అదే నా విషయం తీసుకోండి . ఎక్కడికి వెళ్లాలన్న వెళుతాను.

పెద్ద వయసు వారు తీవ్ర ఆరోగ్య సమస్యలు వున్నా వారు ఇంటి వద్దే ఉండడం అవసరం . అందరూ ఆ పని చేస్తే సర్వ నాశనం తప్పదు . ఇదీ నా ఆలోచన . జనాల్ని ఇదే పద్ధతిలో ఎడ్యుకేట్ చేస్తున్నా.లేదు చెప్పలేము .. వైరస్ తో మన అనుభవం కేవలం ఒక సంవత్సరం . దీన్ని గురించి ఏదైనా అభిప్రాయం మాత్రమే అని కొంతమంది చెబుతున్నారు . నేను ఏప్రిల్ 2020 లో డి విటమిన్ గురించి చెప్పినప్పుడు కొంతమంది ఇలాగె అన్నారు . సరే వారిని నేను బలవంతం పెట్టేది ఏముంది అని వదిలేసా . ఎండలో నడిచిన వారు లేదా డి విటమిన్ తీసుకొన్న వారు .. హలో .. నీ మాట తప్పు . డి విటమిన్ ఈసుకొన్నా ఫలానా వారు చనిపోయారు అని ఎవరూ చెప్పలేదు . ఈ రోజు కరోనా చికిత్స లో ప్రధాన అంశం డి విటమిన్ టాబ్లెట్స్ . { ఎండ లో నడిచినా ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమయాలు ఉంటే అది వేరే సంగతి . మా అమ్మ ఉదాహరణ ఇందాకే ఇచ్చా}
కచ్చితంగా మూడో వేవ్ వస్తుంది అని నమ్మే వారు కూడా వున్నారు . వస్తుంది అని అనుమానం ఉన్న వారు లేదా మూడో వేవ్ రావడం ఖాయం అని నమ్మిన వారు ఏమి చేయబోతున్నారు ? అది వారే నిర్ణయించుకోవలసిన అంశం . శాస్త్రం చెప్పిందే నమ్ముదాము .. ఎవరో అమర్నాథ్ లాంటి క్వాలిఫికేషన్ లేని వ్యక్తుల అభిప్రాయాన్ని పట్టించుకోవద్దు అని వీరి అభిప్రాయం . తప్పు లేదు . మీ ఆలోచన ను గౌరవిస్తాను . బిన్నాభిప్రాయాన్ని గౌరవించడం అనేది నేను ఎన్నో ఏళ్ళ కింద అలవర్చుకొన్నా.

కరోనా సోకకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ? శాస్తం ఏమి చెబుతోంది ? గత సంవత్సరం మార్చ్ నుంచి శాస్త్రం ఒకటే చెబుతోంది . స్టే హోమ్ .. స్టే సేఫ్ .. మొదటి వేవ్ లో కొన్ని కోట్ల మంది కరోనా బారిన పడ్డారు . ఎందుకు .. వారు మాస్క్ .. స్టే హోమ్ పద్దతి ని సరిగా అనుసరించలేదు కాబట్టి . మళ్ళీ రెండో వేవ్ లో మరి కొన్ని కోట్ల మంది పడ్డారు . ఎందుకు .. వారు కూడా మాస్క్ లు సరిగా ధరించలేదు .. స్టే హోమ్ సూత్రాన్ని పాటించలేదు కాబట్టి . ఇప్పుడు మూడో వేవ్ ఖాయం అనో లేదా రావొచ్చు అనో మీరు నమ్ముతున్నారు . సరే స్టే హోమ్ .. స్టే సేఫ్ .. ఎంత కాలం అంటారా ? అది మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న . లేదా స్టే హోమ్ సూత్రాన్ని పదేపదే చెబుతున్నా వారిని అడగాల్సిన ప్రశ్న .

మన ఆలోచనే మన కార్యాచరణ . మన భవిత .. మీ దారిలో ముందుకు సాగండి . తప్పులేదు . నిష్టూరంగానే వ్యంగ్యంగానో ఈ మాట అనడం లేదు . నా గురించి నాకు భ్రమలు ఏమీ లేవు . నా పాత్ర పరిమితం అని తెలుసు . ఏటికి ఎదురీదడం అసాధ్యం అని కూడా తెలుసు . నేను డి బి విటమిన్ ల గురించి పల్స్ ఆక్సీమేటర్ గురించి , వ్యాయామం గురించి చెప్పినప్పుడు చాల మంది నమ్మలేదు . ఎంతో మంది లైట్ గా తీసుకొన్నారు . కొంత మంది అయితే వ్యగ్యంగా కామెంట్ చేసారు . మనసు చివుక్కు మంది నిజమే . కానీ ఇలాంటివాటికి అతీతంగా ఎదిగా . అదే కొన్ని ఏళ్ళ క్రితం అయితే వేరే సంగతి . అప్పుడు వ్యంగ్య కామెంట్స్ చేసిన వారు రెండో వేవ్ లో కరోనా బారిన పడి సర్ ఏమి చెయ్యాలి అంటే ఇదిగో ఇలా చెయ్యండి అంటూ వారికి సాయం చేశా .అంటే దీని అర్థం ఇప్పుడు మూడో వేవ్ లో మిగిలిన వారికి సోకుతుంది అని కాదు .

మనసా వాచా కర్మేనా అంటారు . నేను చెప్పిన దాన్ని నేను ఆచరిస్తా . నా పద్దతికి నేనే ఉదాహరణ . నాకు కరోనా సోకి నేను ఆసుపత్రి పాలైయితే నా పోస్టింగ్స్ ఆపేస్తా . అప్పుడు నా పద్ధతి విఫలం అయినట్టు . లేదా నేను బకెట్ తన్నేస్తే .. అప్పుడు ఇక్కడే ఆ విషయాన్ని పోస్ట్ చేస్తారు . { నా పాస్ వర్డ్ మా వారి వద్ద వుంది } అప్పుడు నా పద్దతి ఫెయిల్ అని అర్థం .

ఇంతకీ నా పద్దతి ఏంటి ? వెయ్యో సారి చెబుతున్నా . మంచి తిండి . వ్యాయామం . నిద్ర . భయం వద్దు . మాస్క్ పెట్టుకోండి కానీ దాన్నే నమ్ముకోవద్దు . తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికే స్టే హోమ్ .. ఇది నేను చెప్పేది . ఇలా చేస్తే సోకినా శోకం ఉండదు . వేవ్ లు వచ్చినా సావులు వుండవు . వున్నా ఏదో తక్కువ స్థాయిలో ..
నా మాటే వేదం అని .. దాన్ని తప్పకుండా నమ్మాలి అని నేను చెప్పడం లేదు . మూడో వేవ్ రావొచ్చు అనుకొనే వారు రావడం ఖాయం అనుకొన్న వారు మీ దారిలో ముందుకు సాగండి . తప్పులేదు . సర్వే జనా సుఖినోభవంతు .