96 శాతానికి చేరువైన కరోనా రికవరీ రేటు
67 వేల కేసులు..8 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తోంది. నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.బుధవారం 19,31,249 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.67,208మందికి పాజిటీవ్ వచ్చింది. అయితే, వరుసగా రెండోరోజు కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల […]

67 వేల కేసులు..8 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తోంది. నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.
బుధవారం 19,31,249 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.67,208మందికి పాజిటీవ్ వచ్చింది. అయితే, వరుసగా రెండోరోజు కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 2.97కోట్లకు చేరింది. 24 గంటల వ్యవధిలో 2,330మంది మృత్యుఒడికి చేరుకొన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 3,81,903మంది మహమ్మారికి బలయ్యారు. ఇక క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 8,26,740మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.78శాతానికి తగ్గింది. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. నిన్న 1,03,570 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.85కోట్లు చేరాయి. మరోపక్క నిన్న 34,63,961 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 26,55,19,251కి చేరింది.