మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త పన్ను, ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ ఈ నెల 8, 9 తేదీల్లో సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశాలు. – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక పట్టణ ప్రజలపై పన్నుల భారాలు మోపడం దుర్మార్గం. విధాత:రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కుటుంబాలపై ఏడాదికి రు.750 నుండి రు.1,450 వరకు పెరిగిన పన్నుల భారం పడుతుంది.కరోనా తీవ్రతతో ఆర్థికంగా అల్లాడుతున్న ప్రజలకు ఆస్తి, చెత్తపన్నుల పెంపు గుదిబండే.ఆస్తి పన్ను పెంపుదల జీవోలను ఉపసంహరించాలని స్థానిక ఎన్నికలకు ముందు ఆందోళన చేపట్టడం జరిగింది.ఆస్తిపన్ను, మంచినీటి ఛార్జీల పెంపు జీవోలు 197, 198 లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ […]

ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక పట్టణ ప్రజలపై పన్నుల భారాలు మోపడం దుర్మార్గం.
విధాత:రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కుటుంబాలపై ఏడాదికి రు.750 నుండి రు.1,450 వరకు పెరిగిన పన్నుల భారం పడుతుంది.కరోనా తీవ్రతతో ఆర్థికంగా అల్లాడుతున్న ప్రజలకు ఆస్తి, చెత్తపన్నుల పెంపు గుదిబండే.ఆస్తి పన్ను పెంపుదల జీవోలను ఉపసంహరించాలని స్థానిక ఎన్నికలకు ముందు ఆందోళన చేపట్టడం జరిగింది.ఆస్తిపన్ను, మంచినీటి ఛార్జీల పెంపు జీవోలు 197, 198 లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి అధిక మెజార్టీతో ఇచ్చిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బహుమతి పన్నుల భారమా?
పాలకుల తీరును నిరసిస్తూ రేపు (7న) రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు మెమోరాండం సమర్పించనున్న సిపిఐ.ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు నగరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్న సిపిఐ.