రోడ్డుపైనే ప్రసవం
విధాత(విశాఖ): కరోనా పరీక్షల కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. విశాఖ పట్టణం, అడవి వరం ఆరోగ్య కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖకు చెందిన ఓ మహిళ అనారోగ్యానికి గురైంది. కరోనా సోకిందనే అనుమానంతో అడవి వరం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమెకు సకాలంలో పరీక్షలు చేయలేదు.. దీంతో కరోనా పరీక్షల కోసం రోడ్డుపై నిరీక్షించాల్సి వచ్చింది. ఆ సమయంలో పురిటి […]

విధాత(విశాఖ): కరోనా పరీక్షల కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. విశాఖ పట్టణం, అడవి వరం ఆరోగ్య కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖకు చెందిన ఓ మహిళ అనారోగ్యానికి గురైంది. కరోనా సోకిందనే అనుమానంతో అడవి వరం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.
అక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమెకు సకాలంలో పరీక్షలు చేయలేదు.. దీంతో కరోనా పరీక్షల కోసం రోడ్డుపై నిరీక్షించాల్సి వచ్చింది. ఆ సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమైంది. అప్పటికే గర్భిణి రోడ్డుపై ప్రసవించింది. చివరకు చేసేదేమీ లేక వైద్యులు బాలింతను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.