ప్రజల ప్రాణాలకు నష్టం కలగొద్దు: చంద్ర‌బాబు

విధాత‌(అమరావతి): ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా తెలుగు రాష్ట్రాల సీఎంలు శ్రద్ధ చూపాలని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు సూచించారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అనంతపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేతపై చంద్రబాబు నాయుడు స్పందించారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంబులెన్స్‌లు ఆపుతున్నారని, చికిత్స కోసం తెలంగాణకు వెళ్తున్నవారిని ఆపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా ఇరు రాష్ట్రాలు శ్రద్ధ చూపాలని సూచించారు. ఇరు రాష్ట్రాలు మాట్లాడుకుని సహకరించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో […]

ప్రజల ప్రాణాలకు నష్టం కలగొద్దు: చంద్ర‌బాబు

విధాత‌(అమరావతి): ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా తెలుగు రాష్ట్రాల సీఎంలు శ్రద్ధ చూపాలని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు సూచించారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అనంతపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేతపై చంద్రబాబు నాయుడు స్పందించారు.

పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంబులెన్స్‌లు ఆపుతున్నారని, చికిత్స కోసం తెలంగాణకు వెళ్తున్నవారిని ఆపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా ఇరు రాష్ట్రాలు శ్రద్ధ చూపాలని సూచించారు. ఇరు రాష్ట్రాలు మాట్లాడుకుని సహకరించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో పడక అనుమతి పొందినట్లు రోగి బంధువులు తెలిపినా తెలంగాణ పోలీసులు అంగీకరించకపోవడం స‌రికాద‌న్నారు.