ఎర్టుగ్లిఫ్లోజిన్ కరోనాను అడ్డుకుంటుంది
విధాత,హైదరాబాద్: కొవిడ్ ఔషధ పరిశోధనలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అంకుర సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది. మధుమేహ నియంత్రణకు వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్ ఔషధం కరోనాను అడ్డుకుంటుందని వీరి అధ్యయనంలో తేలింది.కేంద్రీయ వర్సిటీలోని రీజీన్ ఇన్నోవేషన్స్ అంకుర సంస్థ, ఇంద్రాస్, టెక్‌మహేంద్ర తోడ్పాటుతో కొవిడ్ ఔషధ ప్రయోగాలను చేపట్టింది. వీరి పరిశోధనలో ఎర్టుగ్లిఫ్లోజిన్ ఔషధం కొవిడ్-19 స్పైక్ ప్రొటీన్ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా సమర్థంగా అడ్డుకోవడం గుర్తించారు.కొవిడ్ బారిన పడితే ప్రాథమికంగా కన్పించే లక్షణాలైన శరీర కణజాలాల్లో […]

విధాత,హైదరాబాద్: కొవిడ్ ఔషధ పరిశోధనలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అంకుర సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది. మధుమేహ నియంత్రణకు వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్ ఔషధం కరోనాను అడ్డుకుంటుందని వీరి అధ్యయనంలో తేలింది.
కేంద్రీయ వర్సిటీలోని రీజీన్ ఇన్నోవేషన్స్ అంకుర సంస్థ, ఇంద్రాస్, టెక్‌మహేంద్ర తోడ్పాటుతో కొవిడ్ ఔషధ ప్రయోగాలను చేపట్టింది. వీరి పరిశోధనలో ఎర్టుగ్లిఫ్లోజిన్ ఔషధం కొవిడ్-19 స్పైక్ ప్రొటీన్ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా సమర్థంగా అడ్డుకోవడం గుర్తించారు.
కొవిడ్ బారిన పడితే ప్రాథమికంగా కన్పించే లక్షణాలైన శరీర కణజాలాల్లో వాపు, రక్తం గడ్డకట్టే సామర్థ్యం గణనీయంగా తగ్గడం తదితరాలను త్రీడీ మానవ వాస్కులర్ ఊపిరితిత్తుల నమూనాలో పరిశోధకులు గుర్తించారు.