Gold Price | బంగారం కొనాలనుకుంటున్నారా..? తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Price | బంగారం అంటే భారతీయులకు మక్కువ ఎక్కువగానే ఉంటుంది. వివాహాలు, పండుగలు కొనుగోలు చేస్తూ వస్తుంటారు. అలాగే పలువురు బంగారంపై పెట్టుబడి సురక్షితమైందిగా భావిస్తుంటారు. ఈ క్రమంలో భారీగానే బంగారం కొనుగోలు జరుగుతుంటాయి. అయితే, ఇటీవల భారీగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజురోజుకు గోల్డ్‌ ధర పైపైకి వెళ్తే తాము కొనగలమా? అంటూ సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. మే నెల సమీపిస్తుండడంతో వివాహాలకు సంబంధించిన శుభమూహుర్తాలు మొదలవనున్నాయి. మరో వైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. […]

Gold Price | బంగారం కొనాలనుకుంటున్నారా..? తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Price | బంగారం అంటే భారతీయులకు మక్కువ ఎక్కువగానే ఉంటుంది. వివాహాలు, పండుగలు కొనుగోలు చేస్తూ వస్తుంటారు. అలాగే పలువురు బంగారంపై పెట్టుబడి సురక్షితమైందిగా భావిస్తుంటారు. ఈ క్రమంలో భారీగానే బంగారం కొనుగోలు జరుగుతుంటాయి.

అయితే, ఇటీవల భారీగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజురోజుకు గోల్డ్‌ ధర పైపైకి వెళ్తే తాము కొనగలమా? అంటూ సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. మే నెల సమీపిస్తుండడంతో వివాహాలకు సంబంధించిన శుభమూహుర్తాలు మొదలవనున్నాయి. మరో వైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో ఏం కొనాలా..? వద్దా..? అని తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

అయితే, మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మూడు నాలుగు రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా ధరలు దిగిరాగా.. ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 వరకు తగ్గింది.

ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,400 పలుకుతోంది. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ.850 వరకు దిగి వచ్చింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర సైతం పతనమైంది. తులం బంగారం ధర రూ.430 తగ్గి.. రూ.60,430 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్‌ గోల్డ్‌ ధర నాలుగు రోజుల్లో రూ.930 వరకు తగ్గింది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్‌ బంగారం ధర రూ.55,550 పలుకుతుండగా.. 24 క్యారెట్‌ బంగారం ధర రూ.60,580 వద్ద కొనసాగుతుంది. అలాగే వెండి ధరలు సైతం పడిపోతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.200 తగ్గి రూ.80వేల మార్క్‌ వద్ద కొనసాగుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో రూ.76,300గా ఉన్నది. మరో వైపు అటు అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం ధర దిగి వచ్చింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ప్రస్తుతం 1994.65కు దిగిరాగా.. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.91 డాలర్ల మార్క్ వద్ద ట్రేడ్‌ అవుతోంది.