Karre Guttala | కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మృతి?

Karre Guttala |
విధాత: తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు కర్రెగుట్టల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. అధికారిక వివరాలు తెలవనప్పటికీ జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సంఘటనలో 28 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తుంది. గత ఐదు రోజులుగా ఇక్కడ వేలాది మంది భద్రత బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.!
ఈ దాడిలో 28 మంది మావోయిస్టుల మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ఘటన స్టలి నుండి మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మా, ముఖ్య నేతలు మరి కొందరు తప్పించుకున్నట్లు కూడా ప్రచారం సాగుతుంది. అధికారిక ప్రకటన వెలువడితే కానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి..
పహల్గామ్ దాడితో.. మాకు సంబంధం లేదు: TRF ! పాక్ ఆర్మీ చీఫ్ సూచనలతోనేనా?
Dal Lake Shikara | ఉగ్రవాదాన్ని ఎదిరించిన మహిళ.. దాల్ లేక్‌లో బోట్ షికార్!
Knife in Lungs | ఊపిరితిత్తుల్లో 8 సెం.మీ. కత్తి.. మూడేండ్ల పాటు నరకయాతన