kavitha: కవిత ఎపిసోడ్ ఓ డ్రామా..

కేటీఆర్ పై సొంత చెల్లే విమర్శలు చేస్తోంది
రాష్ట్ర ప్రజలు ఆయనను ఎలా నమ్మాలి
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించగలరా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి
kavitha: విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడం.. తాజాగా సొంతపార్టీ మీదే విమర్శలు గుప్పించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. కవిత ఇష్యూపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ ప్లాన్ చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ మీద సొంత చెల్లెలే విమర్శలు చేస్తున్నారని.. అటువంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఫ్యామిలీ ఎందరో నేతల రాజకీయ జీవితాలను బలి తీసుకున్నదని పేర్కొన్నారు. తాజాగా జరుగుతున్నదంతా ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
ఇక కేసీఆర్ తన కుటుంబాన్నే మేనేజ్ చేయలేకోపోతున్నారని.. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ ఎందరో ఉద్యమకారుల గొంతులను కోశారంటూ విమర్శించారు.