రేపు రాయలసీమలో కృష్ణా బోర్డు బృందం పర్యటన
విధాత:రేపు రాయలసీమలో యథాతథంగా కృష్ణా బోర్డు బృందం పర్యటించనుంది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తనిఖీలలో తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ పేర్కొంది. సీడబ్లూసీలో పనిచేస్తున్న దేవేందర్రావును తనిఖీ బృందంలో చేర్చడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. తెలుగు వ్యక్తులు లేకుండా తనిఖీలకు వెళ్లాలని కృష్ణాబోర్డుకు ఎన్జీటీ ఆదేశించింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని కృష్ణాబోర్డును […]

విధాత:రేపు రాయలసీమలో యథాతథంగా కృష్ణా బోర్డు బృందం పర్యటించనుంది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తనిఖీలలో తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ పేర్కొంది.
సీడబ్లూసీలో పనిచేస్తున్న దేవేందర్రావును తనిఖీ బృందంలో చేర్చడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. తెలుగు వ్యక్తులు లేకుండా తనిఖీలకు వెళ్లాలని కృష్ణాబోర్డుకు ఎన్జీటీ ఆదేశించింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది.