ప్రముఖ జర్నలిస్టు TNR కరోనాతో మృతి

కరోనాతో తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూతహైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యూట్యూబ్‌ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథిలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు, నటుడిగానూ టీఎన్‌ఆర్‌ తనదైన ముద్రవేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. టీఎన్‌ఆర్‌ అసలు పేరు తుమ్మల […]

ప్రముఖ జర్నలిస్టు TNR కరోనాతో మృతి

కరోనాతో తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూత
హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యూట్యూబ్‌ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథిలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు, నటుడిగానూ టీఎన్‌ఆర్‌ తనదైన ముద్రవేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. టీఎన్‌ఆర్‌ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. ఆయన మరణవార్త విన్న పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
డైరెక్టర్‌ అవుదామని
తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్‌ఆర్‌) దర్శకత్వంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. డిగ్రీ అయ్యాక సినిమాల మీద ఆసక్తి బాగా పెరిగింది. చిరంజీవి ఆయన అభిమాన నటుడు. చిరు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవారు. 1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద సహాయకుడిగా పనిచేశారు. పలు చిత్రాలకు రచనలో సహకారం అందించారు. చిరు ‘హిట్లర్‌’ చిత్రానికి స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్నా, దర్శకుడిగా, రచయితగా సినిమాల వైపు రాకుండా బుల్లితెరకు వెళ్లారు. పలు న్యూస్‌ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు.
తేజ ఇంటర్వ్యూతో పాపులర్‌
యూట్యూబ్‌ ట్రెండ్‌ నడుస్తున్న సమయంలో ఓ యూట్యూబ్‌ వేదికగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు.దర్శకుడు తేజతో చేసిన ఇంటర్వ్యూ పాపులర్‌ అవడంతో టీఎన్‌ఆర్‌ నెటిజన్లకు మరింత దగ్గర అయ్యారు. తేజతో గంట సేపు ఇంటర్వ్యూ అనుకొని వెళితే రెండు గంటలకు పైగా చేశానని, అసలు అంతసేపు జనాలు చూస్తారా అనుకున్నానని టీఎన్‌ఆర్‌ ఓ సందర్భంలో చెప్పారు.