ఎంపీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై లోక్ సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలి
విధాత;ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం ఎం.పి.రఘు రామకృష్ణ రాజు విషయంలో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గర్హించాలి. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యుడి పట్ల అధికారుల తీరును జనసేన పార్టీ ఖండిస్తోంది. డా.అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం అధికారుల బాధ్యత. ఒక ఎం.పి.కావచ్చు ఒక సాధారణ పౌరుడు కావచ్చు.. ఎవరి పట్లా విచారణ పేరుతో అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోంది. నిబంధనలకు లోబడి విచారణ ప్రక్రియ చేపట్టాలని ఉంది. అయితే […]

విధాత;ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం ఎం.పి.రఘు రామకృష్ణ రాజు విషయంలో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గర్హించాలి. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యుడి పట్ల అధికారుల తీరును జనసేన పార్టీ ఖండిస్తోంది. డా.అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం అధికారుల బాధ్యత. ఒక ఎం.పి.కావచ్చు ఒక సాధారణ పౌరుడు కావచ్చు.. ఎవరి పట్లా విచారణ పేరుతో అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోంది. నిబంధనలకు లోబడి విచారణ ప్రక్రియ చేపట్టాలని ఉంది. అయితే ఏపీ పోలీసు విభాగంలో కొందరు అధికారులు మాత్రం చట్ట సభ సభ్యుడి విషయంలోనే నిబంధనలకు, చట్టానికి తూట్లు పొడిచారు. తమ కర్తవ్యాన్ని
విస్మరించి వ్యవహరిస్తున్నారు.రఘు రామకృష్ణ రాజుకి లోక్ సభ సభ్యుడిగా ఉండే హక్కులను కాలరాసినట్లు అర్థం అవుతోంది. ఒక లోక్ సభ సభ్యుడి విషయంలోనే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?
ఈ వ్యవస్థను సరి చేసే అధికారం చట్ట సభలకు ఉంటుంది. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలకు ఇందుకు స్ఫష్టమైన అధికారాలున్నాయి.రఘు రామకృష్ణ రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును లోక్ సభ స్పీకర్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించాలని జనసేన పార్టీ కోరుతుంది. ఇది కచ్చితంగా ఒక సభ్యుడికి ఉన్న హక్కులను కొందరు అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించారు. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ గా లోక్ సభ స్పీకర్ గుర్తించాలి. ఇందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొనే విశేష అధికారం పార్లమెంట్ కు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించకపోతే చట్ట సభలకు ఉన్న ప్రాధాన్యత, విశిష్టతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఈ అంశాలపై పార్లమెంట్ సభ్యుల సహకారంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గారికి జనసేన లేఖ రాస్తుంది.నాదెండ్ల మనోహర్