ఇక ఇసుక క్యాష్ అండ్ క్యారీ

విధాత:నెల్లూరు జిల్లాలో ఇక నుంచి ఇసుక తవ్వకం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం జెపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించింది.ఇసుక కావాల్సిన వారు నేరుగా క్వారీ వద్దకు వెళ్లి ఎంత ఇసుక పరిమాణం కావాలో తెలిపి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సంస్థ అన్ని క్వారీల్లో ఇసుక అమ్మకాలకు అనుమతి పొందింది.ఇసుక టన్నుకు 475 గా నిర్దేశించారు.నెల్లూరు జిల్లాలోని అన్ని ఇసుక రీచ్ లలో జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కాకుండా వేరే వ్యక్తులు ఇసుక […]

ఇక ఇసుక క్యాష్ అండ్ క్యారీ

విధాత:నెల్లూరు జిల్లాలో ఇక నుంచి ఇసుక తవ్వకం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం జెపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించింది.ఇసుక కావాల్సిన వారు నేరుగా క్వారీ వద్దకు వెళ్లి ఎంత ఇసుక పరిమాణం కావాలో తెలిపి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సంస్థ అన్ని క్వారీల్లో ఇసుక అమ్మకాలకు అనుమతి పొందింది.ఇసుక టన్నుకు 475 గా నిర్దేశించారు.నెల్లూరు జిల్లాలోని అన్ని ఇసుక రీచ్ లలో జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కాకుండా వేరే వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్ ఆర్ ప్యాకేజీ ఇల్లు, పేదలకు జగన్ అన్న ఇల్లు పథకాలకు సంబంధించి ఇసుకను ఉచితంగా అందజేయనున్నారు.నూతన ఇసుక విధానం గురించి జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా ఇసుక అధికారి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.