తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేనిది.. ఎన్వీ రమణ
తెలుగు ప్రజల రుణం తీర్చలేనిదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు. విధాత:సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన .. మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో తనను చూసి గర్వించటానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదని, అయితే, సీజేఐగా ఈ వారంరోజుల పర్యటనలో తెలుగు […]

తెలుగు ప్రజల రుణం తీర్చలేనిదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు.
విధాత:సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన .. మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో తనను చూసి గర్వించటానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదని, అయితే, సీజేఐగా ఈ వారంరోజుల పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని పేర్కొన్నారు.తల్లిదండ్రుల వలే అక్కున చేర్చుకుని ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలిపారు.
కొవిడ్‌కు సైతం వెరవక అసంఖ్యాకంగా వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు చెప్పారు.ముఖ్యమంత్రి మొదలుకుని సాధారణ పౌరుని వరకూ ప్రతి ఒక్కరూ స్వాగతం పలికి అంతా మనోళ్లే అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ద హైదరాబాదీ ఆతిథ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు.
అనూహ్య స్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు ధన్యవాదాలు చెప్పారు.యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చి దిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. వారం క్రితం తెలుగు నేలపై కాలుమోపినప్పటి నుంచి నేడు దిల్లీ బయల్దేరే వరకు తనను కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ అధికారులు,రాజ్‌భవన్ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల దీవెనల బలంతో రాజ్యాంగ బద్ద విధుల్ని సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయాణమవుతున్నా’’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటనలో వెల్లడించారు.