ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విరుచుకు ప‌డ్డ పోసాని

విధాత‌: రిప‌బ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో, అటు రాజ‌కీయ వ‌ర్గాల‌లోను సంచ‌ల‌నంగా మారాయి. అత‌నిపై పలువురు వైసీపీ నేత‌లతో పాటు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కౌంట‌ర్స్ వేస్తున్నారు.తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన పోసాని.. ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ త‌న సినిమా కోసం హీరోయిన్‌ని, పారితోషికం, క‌థ అన్నీ తానే స్వ‌యంగా సెల‌క్ట్ చేసుకుంటాడు. రెమ్యున‌రేష‌న్ కూడా ఆయ‌నే చెబుతాడు. ‘పవన్‌ నీ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విరుచుకు ప‌డ్డ పోసాని

విధాత‌: రిప‌బ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో, అటు రాజ‌కీయ వ‌ర్గాల‌లోను సంచ‌ల‌నంగా మారాయి. అత‌నిపై పలువురు వైసీపీ నేత‌లతో పాటు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కౌంట‌ర్స్ వేస్తున్నారు.తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన పోసాని.. ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ త‌న సినిమా కోసం హీరోయిన్‌ని, పారితోషికం, క‌థ అన్నీ తానే స్వ‌యంగా సెల‌క్ట్ చేసుకుంటాడు. రెమ్యున‌రేష‌న్ కూడా ఆయ‌నే చెబుతాడు. ‘పవన్‌ నీ రెమ్యునరేషన్‌ 10 కోట్లా.. 50 కోట్లా. అత‌ను త‌న సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. నేను ఒక్క సినిమాకు రూ. 15 కోట్ల చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా? అంటూ పోసాని ఫైర్ అయ్యాడు.

తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్‌ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు. మెగాస్టార్‌ చిరంజీవి సంస్కారవంతుడని, ఆయనను చూసి పవన్‌ నేర్చుకోవాలన్నారు. హీరోలు అంటే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లని, వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టేవారు కాదన్నారు. వారు తెరమీదే కాదు నిజ జీవితంలోనూ రియల్‌ హీరోలని పేర్కొన్నారు.

పోసాని ప్రెస్ మీట్ అనంత‌రం ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు .. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు స‌హజమే …అంటూ సంచ‌ల‌న ట్వీట్ చేశారు.