కుప్పంలో వైద్యసదుపాయాలు కల్పించండి

విధాత‌(చిత్తూరు): కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు అధికమవుతున్నాయని, పెరుగుతున్న పాజిటివ్‌లకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు కల్పించాలని తెదేపా అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు కలెక్టర్‌ హరినారాయణన్‌కు లేఖ రాశారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని, మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన లేఖలో కోరారు. శాంతిపురం మండలంలోని న్యాక్‌లో 200 పడకలతో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కొవాగ్జిన్‌ రెండో డోసు కోసం నిరీక్షిస్తున్న నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులో […]

కుప్పంలో వైద్యసదుపాయాలు కల్పించండి

విధాత‌(చిత్తూరు): కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు అధికమవుతున్నాయని, పెరుగుతున్న పాజిటివ్‌లకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు కల్పించాలని తెదేపా అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు కలెక్టర్‌ హరినారాయణన్‌కు లేఖ రాశారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని, మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన లేఖలో కోరారు.

శాంతిపురం మండలంలోని న్యాక్‌లో 200 పడకలతో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కొవాగ్జిన్‌ రెండో డోసు కోసం నిరీక్షిస్తున్న నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో 50 ఆక్సిజన్‌ పడకలు, 10 వెంటిలేటర్లను అత్యవసర ప్రాతిపదికన ఏర్పాటు చేయడంతోపాటు సరిపడా రెమిడెసివిర్‌లను ఉంచాలన్నారు.

పీఈఎస్‌ ఆసుపత్రిలో 150 ఆక్సిజన్‌ పడకలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలన్నారు. కుప్పం ప్రాంతీయ వైద్యశాల, పీఈఎస్‌ ఆసుపత్రికి సరిపడా ఆక్సిజన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.కుప్పంలో వైద్యసదుపాయాలు కల్పించండి

విధాత‌(చిత్తూరు): కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు అధికమవుతున్నాయని, పెరుగుతున్న పాజిటివ్‌లకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు కల్పించాలని తెదేపా అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు కలెక్టర్‌ హరినారాయణన్‌కు లేఖ రాశారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని, మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన లేఖలో కోరారు.

శాంతిపురం మండలంలోని న్యాక్‌లో 200 పడకలతో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కొవాగ్జిన్‌ రెండో డోసు కోసం నిరీక్షిస్తున్న నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో 50 ఆక్సిజన్‌ పడకలు, 10 వెంటిలేటర్లను అత్యవసర ప్రాతిపదికన ఏర్పాటు చేయడంతోపాటు సరిపడా రెమిడెసివిర్‌లను ఉంచాలన్నారు.

పీఈఎస్‌ ఆసుపత్రిలో 150 ఆక్సిజన్‌ పడకలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలన్నారు. కుప్పం ప్రాంతీయ వైద్యశాల, పీఈఎస్‌ ఆసుపత్రికి సరిపడా ఆక్సిజన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.