వరద ఉధృతికి కొట్టుకు పోయిన పులిచింతల గేటు
విధాత:గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకారణంగా కృష్ణానదికి వరద కొనసాగుతుండగా నాగార్జునా సాగర్ ఆయకట్టు నిండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.దీంతో సాగర్ కి దిగువన వున్నపులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉండగా పెరిగిన వరద ఉధృతితో ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది.సమాచారం తెలుసుకున్న జలవనరుల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తొలగిన స్థానంలో స్టాప్ […]

విధాత:గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకారణంగా కృష్ణానదికి వరద కొనసాగుతుండగా నాగార్జునా సాగర్ ఆయకట్టు నిండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.దీంతో సాగర్ కి దిగువన వున్నపులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉండగా పెరిగిన వరద ఉధృతితో ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది.సమాచారం తెలుసుకున్న జలవనరుల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తొలగిన స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయనున్న అధికారులు.దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద ఉధృతి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వరద కొనసాగే అవకాశముంది. కావునా వరద తగ్గితే కానీ ఈ గేటు తిరిగి పెట్టేందుకు వీలు కాదని తెలుస్తోంది.