సీఎం స్టాలిన్‌ను కలిసిన రజినీకాంత్‌

విధాత;హైదరాబాద్‌,తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ఆ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సినీహీరో రజనీకాంత్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా తనవంతుగా సీఎం సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం అందజేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను విధిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా రెండో వేవ్‌ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు తమవంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని […]

సీఎం స్టాలిన్‌ను కలిసిన రజినీకాంత్‌

విధాత;హైదరాబాద్‌,తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ఆ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సినీహీరో రజనీకాంత్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా తనవంతుగా సీఎం సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం అందజేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను విధిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కరోనా రెండో వేవ్‌ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు తమవంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం ఎంకే స్టాలిన్‌ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, వివిధ అంశాలను పర్యవేక్షించేందుకు సీఎం స్టాలిన్‌ అధ్యక్షత ఆదివారం 13 మంది శాసనసభ్యులతో శాసనసభ సలహా కమిటీ ఏర్పడింది.