HYD | జర్మనీ యువతిపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

విధాత : మీర్ పేట్ పహాడీ షరిఫ్ పరిధిలో జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ అస్లాం అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. మార్చి తొలి వారంలో హైదరాబాద్ వచ్చిన జర్మన్ యువతి, యువకుడు తమ స్నేహితుడి ఇంట్లో ఉంటూ నగరాన్ని సందర్శిస్తున్నారు. వారితో పరిచయం పెంచుకున్న అస్లాం పథకం ప్రకారం వారిని ట్రాప్ చేశాడు. తన కారులో మైనర్ పిల్లలను ఎక్కించుకుని వారితో పాటు జర్మనీ యువతి, యువకుడి వద్ధకు వెళ్లి పిల్లలతో పాటు మీకు కూడా హైదరాబాద్ నగరం చూపిస్తానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి కారు ఎక్కారు. మార్గమధ్యలో ఫోటోలు దిగేందుకు జర్మనీ యువకుడు కారు దిగాడు.
అదే అదనుగా తీసుకున్న అస్లాం కారును యూ టర్న్ తీసుకొద్దామని చెప్పి జర్మనీ యువతిని కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు. తిరిగి అదే కారులో బాధితురాలిని తీసుకెలుతుండగా..కారు స్లో అవ్వగానే కిందకు దూకి తప్పించుకుంది. కొద్ధి దూరంలో ఉన్న తన స్నేహితుడి వద్ధకు వెళ్లి పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అస్లాంను పట్టుకుని రిమాండ్ చేశారు. అస్లాం కారులో పిల్లలను ఎక్కించుకుని ఇదే రీతిలో మహిళలను ట్రాప్ చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. అస్లాంపై గతంలోనూ రేప్ కేసు ఉందని..కొంతకాలం జైలుకు కూడా వెళ్లాడని..అతని సోదరులపై కూడా కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు