రైతుల‌కు రూ.60 కోట్లు ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్‌

విధాత‌: ఎనికేపాడులోని పల్లవి రైస్‌మిల్లర్ విశ్వనాథం చేతిలో రైతులు మోసపోయిన‌ట్లు చెబుతున్నారు. విజయవాడలోని రామ మందిరం వద్ద విశ్వనాధం ఇంటికి తెలుగు రాష్ట్రాల్లోని బాధిత రైతులు చేరుకుంటున్నారు. రైతులకు డబ్బులు ఎగ్గొట్టి విశ్వనాథం తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు.ఉభయగోదావరి జిల్లాలతో పాటు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కాకినాడ, కృష్ణాజిల్లా, తెలంగాణ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీగా బాధితులు ఉన్నట్లు సమాచారం. పల్లవి రైస్ మిల్లు వ్యాపారం పేరిట ధాన్యం కొని దాదాపుగా రూ. 60 కోట్లు ఎగవేసినట్లు తెలిసింది.బకాయిపడ్డ […]

రైతుల‌కు రూ.60 కోట్లు ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్‌

విధాత‌: ఎనికేపాడులోని పల్లవి రైస్‌మిల్లర్ విశ్వనాథం చేతిలో రైతులు మోసపోయిన‌ట్లు చెబుతున్నారు. విజయవాడలోని రామ మందిరం వద్ద విశ్వనాధం ఇంటికి తెలుగు రాష్ట్రాల్లోని బాధిత రైతులు చేరుకుంటున్నారు. రైతులకు డబ్బులు ఎగ్గొట్టి విశ్వనాథం తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాలతో పాటు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కాకినాడ, కృష్ణాజిల్లా, తెలంగాణ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీగా బాధితులు ఉన్నట్లు సమాచారం. పల్లవి రైస్ మిల్లు వ్యాపారం పేరిట ధాన్యం కొని దాదాపుగా రూ. 60 కోట్లు ఎగవేసినట్లు తెలిసింది.బకాయిపడ్డ 54 మంది రైతులు , వ్యాపారులకు 25 కోట్లు చెల్లిస్తానని 2015లో విశ్వనాధం అగ్రిమెంట్ చేశారు. విశ్వనాథం ఇంటికి తాళం వేసి ఉండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.