రైలు ప్రయాణంలో కోవిడ్ ఆంక్షలు ఎత్తేసిన దక్షణ మధ్యరైల్వే
విధాత: రైళ్లలోని జనరల్ బోగీల్లో ఇక కొవిడ్‌కు ముందు మాదిరే ప్రయాణం చేయవచ్చని దక్షణ మధ్య రైల్వే తెలిపింది.స్టేషన్లలోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్ టికెట్ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చునని,ఈ నిర్ణయం 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని అయితే హైదరాబాద్ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలుచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సోమవారం తెలిపింది. జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్ […]

విధాత: రైళ్లలోని జనరల్ బోగీల్లో ఇక కొవిడ్‌కు ముందు మాదిరే ప్రయాణం చేయవచ్చని దక్షణ మధ్య రైల్వే తెలిపింది.స్టేషన్లలోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్ టికెట్ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చునని,ఈ నిర్ణయం 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని అయితే హైదరాబాద్ – పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలుచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సోమవారం తెలిపింది. జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.