HCU భూములను సందర్శించిన బీజేపీ ఎంపీలు!

విధాత: వివాదస్పద హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూములను బీజేపీ ఎంపీల బృందం బుధవారం సందర్శించింది. ముందుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీకి HCU వీసీ జగదీశ్వర్ రావు కూడా హాజరయ్యారు. హెచ్ సీయూ భూముల వివరాలను వీసీ ఎంపీలకు వివరించారు.
అక్కడి నుంచి బీజేపీ ఎంపీలు HCU భూముల సందర్శనకు వెళ్లారు. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూములు యూనివర్సిటీవా..లేక ప్రభుత్వానివా అన్న రికార్డులను పరిశీలించారు. బీజేపీ ఎంపీలు బృందంలో డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు తదితరులు ఉన్నారు.
మరోవైపు HCU భూములు టీజీఐఐసీ (TGIIC)కి చెందినవని ఈస్ట్ క్యాంపస్‌లో ప్రభుత్వ అధికారులు బోర్డులు నాటడం చర్చనీయాంశమైంది. ఇంకోవైపు హెచ్ సీయూ భూముల వివాదంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ యూనివర్సిటీ అధికారులు, ఉద్యోగులతో వరుస భేటీలు నిర్వహిస్తుంది.