Tomato | ఆకాశాన్నంటిన‌ ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు.. ఉల్లిగ‌డ్డ మాత్రం కిలో రూ. 3..!

Tomato | పెరిగిన కూర‌గాయల ధ‌ర‌ల‌తో సామాన్యుడు విల‌విల‌లాడిపోతున్నాడు. మ‌రి ముఖ్యంగా ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. ఈ రెండింటిని కొనేందుకు ఎవ‌రూ కూడా సాహ‌సం చేయ‌డం లేదు. ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు మండిపోతున్నాయి. ఏకంగా కిలో ట‌మాటా రూ. 120 పలుకుతోంది. ప‌చ్చి మిర్చి ధ‌ర కూడా ఇదే స్థాయిలో భ‌గ్గుమంటుంది. ఇక ఉల్లిపాయ ధ‌ర మాత్రం దారుణంగా ప‌డిపోయింది. కిలో ఉల్లిపాయ ధ‌ర కేవ‌లం రూ. 3 మాత్ర‌మే. దీనికి కార‌ణం […]

Tomato | ఆకాశాన్నంటిన‌ ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు.. ఉల్లిగ‌డ్డ మాత్రం కిలో రూ. 3..!

Tomato | పెరిగిన కూర‌గాయల ధ‌ర‌ల‌తో సామాన్యుడు విల‌విల‌లాడిపోతున్నాడు. మ‌రి ముఖ్యంగా ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. ఈ రెండింటిని కొనేందుకు ఎవ‌రూ కూడా సాహ‌సం చేయ‌డం లేదు. ట‌మాటా, ప‌చ్చి మిర్చి ధ‌ర‌లు మండిపోతున్నాయి.

ఏకంగా కిలో ట‌మాటా రూ. 120 పలుకుతోంది. ప‌చ్చి మిర్చి ధ‌ర కూడా ఇదే స్థాయిలో భ‌గ్గుమంటుంది. ఇక ఉల్లిపాయ ధ‌ర మాత్రం దారుణంగా ప‌డిపోయింది. కిలో ఉల్లిపాయ ధ‌ర కేవ‌లం రూ. 3 మాత్ర‌మే. దీనికి కార‌ణం వ‌ర్షాలు కుర‌వ‌డ‌మే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

టమాటా, పచ్చి మిర్చి లేకుండా కూర‌లు వండ‌టం క‌ష్ట‌మే. క‌చ్చితంగా ఈ రెండింటిని ప్ర‌తి కూర‌లో ఉప‌యోగిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఆ రెండు కూడా అధిక ధ‌ర‌లు ప‌లుక‌డంతో.. వాటిని కొనుగోలు చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ట‌మాటా స్థానంలో ఉల్లిపాయ కొనుగోలు చేసి, కోడిగుడ్డు కూర వండుకోవ‌డం బెట‌ర్ అని ప‌లువురు గృహిణులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమాటా రూ.2-5 మధ్య పలికింది. ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లలో కిలో ట‌మాటా రూ.70- రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.80-రూ.100 మధ్య ఉండగా, రాజస్థాన్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి.

తెలంగాణ‌లోని ప‌ట్ట‌ణాల్లో కిలో ట‌మాట రూ. 100పైనే ప‌లుకుతోంది. కిలో మిర్చి ధ‌ర రూ. 120గా ఉంది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో కూరగాయల మార్కెట్‌లో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మొన్నటి వరకు వేడితో ప్రతికూల వాతావరణంలో ఉత్పత్తి తగ్గినట్లుగా తెలుస్తోంది.

ఉల్లిపాయ సాగుకు ప్ర‌ధాన కేంద్ర‌మైన మ‌హారాష్ట్ర‌లో ఇటీవ‌ల విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. దీంతో ఉల్లిగ‌డ్డ పూర్తిగా త‌డిసిపోయింది. దీంతో ఉల్లి రైతులు తీవ్ర న‌ష్టాన్ని చ‌విచూశారు. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటకు నష్టం వాటిల్లింది.

సోమవారం ఒక్కరోజే మొత్తం 84 లారీల ఉల్లి మార్కెట్‌కు వచ్చినట్లు ఓ వ్యాపారి తెలిపారు. అలాగే వాటిలో చాలా వరకు తడిసిపోయిందని… సూపర్ క్వాలిటీ ధర కిలో రూ. 12 నుంచి రూ.15 పలుకుతుండగా, మీడియం ఉల్లిగడ్డల ధర రూ. 5 నుంచి రూ. 8 వ‌ర‌కు ప‌లుకుతోంది. కానీ వర్షాల కారణంగా పాడైన ఉల్లిని కిలోకు రూపాయి నుంచి రూ. 3 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు.