ఈ వారం ఓటీటీల్లో (అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 13 వరకు) సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 24 విడుదల కానున్నాయి. వాటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 11 స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే, మొత్తం 24 సినిమాలు, సిరీస్‌లలో 11 చూడదగ్గవి ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దామా..! ఇలా ఈ వారం రిలీజ్ కానున్నవాటితో తెలుగు సినిమాలు గొర్రె పురాణం, శబరి, తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం లెవెల్ క్రాస్, హిందీ చిత్రం సర్ఫిరా(ఆకాశమే హద్దురా హిందీ రీమేక్), తెలుగు డబ్బింగ్ తమిళ ఫీల్ గుడ్ మూవీ వాళై, సిటాడెల్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన సిడాటెల్ డయానా చూడదగ్గవి.