Weekend OTT | కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ
వీకెండ్ వచ్చిందంటే సినీప్రియుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా రిలీజ్ అవుతాయి. ఈ వారం థియేటర్‌లోనూ, డిజిటల్ ప్లాట్‌ఫాంలలోనూ సినిమాల సందడి మామూలుగా లేదు. శ్రీలీల, కిరీటి జంటగా నటించిన ‘జూనియర్’ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, రానా సమర్పణలో రూపొందిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Adharva / Entertainement News / 18 July 2025
వీకెండ్ వచ్చిందంటే సినీప్రియుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా రిలీజ్ అవుతాయి. ఈ వారం థియేటర్‌లోనూ, డిజిటల్ ప్లాట్‌ఫాంలలోనూ సినిమాల సందడి మామూలుగా లేదు. శ్రీలీల, కిరీటి జంటగా నటించిన ‘జూనియర్’ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, రానా సమర్పణలో రూపొందిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
July 18 to July 23 OTT | ఓటీటీ ప్లాట్‌ఫాంల విషయానికి వస్తే, ఇటీవల బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన ‘కుబేర’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి కలెక్షన్లు సాధించిన ఈ మూవీని డిజిటల్ వేదికపై చూడాలనే ఆసక్తి ఓటీటీ ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
అదేవిధంగా, జీ5 లో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన ‘భైరవం’ జూలై 18నుంచి అందుబాటులోకి వచ్చింది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కథానాయికలుగా ఆకట్టుకుంటారు.
తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ‘డీఎన్ఏ’ (తెలుగులో ‘మై బేబీ’) ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది. అయితే విడుదలైన 24 గంటల్లోనే జూలై 19 నుండి జియో హాట్‌స్టార్లో తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ ప్రారంభం అవుతోంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు.
అలాగే, యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌ల కోసం ఎదురు చూసే ఓటీటీ ప్రేక్షకుల కోసం, ‘స్పెషల్ ఓపీఎస్ 2’ ఈ శుక్రవారం డిస్నీ+హాట్‌స్టార్లో విడుదలవుతోంది. మొదట జూలై 11కే రిలీజ్ చేయాల్సిన ఈ వెబ్ సిరీస్ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై ఆధారపడి రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
హారర్ కామెడీ జానర్‌లో సంజయ్ దత్, మౌనీరాయ్, సన్నీ సింగ్ నటించిన ‘ది భూత్నీ’ కూడా జీ5 మరియు జీ సినిమాలులో ఒకేసారి జూలై 18 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. దెయ్యాల్ని తరిమే బాబాగా కొత్త అవతారంలో సంజయ్ దత్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.
ఈ వీకెండ్‌కి సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా అందుబాటులోకి రావడంతో ఓటీటీ ప్రేమికులకు పండుగే అని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో లేదా ఇంట్లో కూర్చుని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సరైన కాంబినేషన్ ఇదే. ఇంకా ఏ ఓటీటీలో ఏమేం మొదలయ్యాయో చూడండి.
- అమెజాన్ ప్రైమ్
కుబేర (తెలుగు మూవీ) – జూలై 18
- నెట్‌ఫ్లిక్స్
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18
వాల్ టూ వాల్ – (కొరియన్ సినిమా)- జూలై 18
డెరిలియమ్ – (వెబ్ సిరీస్)- జూలై 18
ఆల్‌మోస్ట్ ఫ్యామిలీ(బ్రెజిలియన్ కామెడీ చిత్రం)- జూలై 18
డిలైట్‌ఫుల్లీ డిసీట్‌ఫుల్(హాలీవుడ్ మూవీ)- జూలై 18
- జియో హాట్‍స్టార్
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 18
స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
- జీ5
భైరవం (తెలుగు సినిమా) – జూలై 18
ద భూత్ని (హిందీ మూవీ) – జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) – జూలై 18
- లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) – జూలై 18
- ఆపిల్ ప్లస్ టీవీ
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 18
- మనోరమ మ్యాక్స్
అస్త్ర(మలయాళ థ్రిల్లర్)- జూలై 18