డేవిడ్ వార్న‌ర్.. ఇత‌ను ఆస్ట్రేలియా క్రికెట‌ర్ అయిన కూడా ఇండియ‌న్ క్రికెట‌ర్ క‌న్నా ఎక్కువ‌గా ప్రేమిస్తుంటారు.త‌నదైన ఆట‌శైలితో పాటు డ్యాన్స్‌ల‌తో ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. వార్న‌ర్ బ్యాటింగ్ చేస్తే బౌండ‌రీలు వెలవెల‌పోతాయి. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా చరిత్రకెక్కిన డేవిడ్ వార్న‌ర్ ఓవ‌రాల్‌గా మూడో ప్లేయ‌ర్‌గా నిలిచాడు.హోబ‌ర్ట్ వేదిగా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20 సంద‌ర్భంగా వార్న‌ర్ ఈ ఘ‌నత సాధించాడు. తాజాగా జ‌రిగిన‌ టీ20లో డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 70 పరుగులు సాధించి త‌న‌లో స‌త్తా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 213 చేసింది. కాని ల‌క్ష్య చేధ‌న‌లో వెస్టిండీస్ చ‌తికిల ప‌డి 11 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. అయితే వార్న‌ర్ విషయానికి వ‌స్తే ఈ ఏడాది ఆరంభంలో వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం టీ20 ఫార్మాట్ మాత్రమే వార్నర్ ఆడుతుండ‌గా, దానికి త్వ‌ర‌లోనే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి టీ20 అనంతరం మాట్లాడిన వార్నర్..జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు చాలా ఉత్స‌హంగా ఉంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడాల‌ని చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను.

మెగాటోర్నీతో టీ20 ప్ర‌పంచ క‌ప్ కూడా ముగించాల‌ని అనుకుంటున్నాను. వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం. ఇక ఇదే జట్టుతో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. ఆ సిరీస్ మాకు ఎంతో కీలకం అని డేవిడ్ వార్న‌ర్ తెలియ‌జేశారు. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌నకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండ‌గా, ఈ టోర్నీ త‌ర్వాత వార్న‌ర్ టీ20ల‌కి కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. కాగా, సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టు ఆడిన వార్న‌ర్ ఆ మ్యాచ్‌తో టెస్ట్ సిరీస్‌కి ముగింపు ప‌లికాడు. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో చివ‌రిగా ఆడాడు.

Updated On 10 Feb 2024 2:40 AM GMT
sn

sn

Next Story