Mumbai Indians|ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గానే రోహిత్ శ‌ర్మ‌.. మ‌ళ్లీ బుజ్జ‌గింపులు మొద‌లు పెట్టిందా?

Mumbai Indians| సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌కి మంచి ట్రాక్ ఉంది. ఇండియాకి ఇటీవ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా అందించాడు. మ‌రోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి ఐదు టైటిల్స్ అందించిన ఘ‌న‌త రోహిత్ శ‌ర్మ‌ది. అయితే రోహిత్ శర్మను గ‌త ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ప‌గ్గా

  • By: sn    sports    Aug 25, 2024 1:41 PM IST
Mumbai Indians|ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గానే రోహిత్ శ‌ర్మ‌.. మ‌ళ్లీ బుజ్జ‌గింపులు మొద‌లు పెట్టిందా?

Mumbai Indians| సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌కి మంచి ట్రాక్ ఉంది. ఇండియాకి ఇటీవ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా అందించాడు. మ‌రోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి ఐదు టైటిల్స్ అందించిన ఘ‌న‌త రోహిత్ శ‌ర్మ‌ది. అయితే రోహిత్ శర్మను గ‌త ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ప‌గ్గాల‌ని హార్ధిక్ పాండ్యాకి అప్ప‌గించింది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను తమ నూతన సారథిగా ఎంపిక చేయ‌డంతో అభిమానులు భ‌గ్గుమ‌న్నారు. హార్ధిక్ సార‌థ్యంలో ఆడిన ముంబై ఇండియ‌న్స్ చెత్త ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచి క‌నీసం ప్లే ఆఫ్స్‌కి కూడా వెళ్ల‌లేక‌పోయింది.

అత‌ను వేరే జ‌ట్టులోకి వెళ‌తాడ‌నే టాక్ కూడా వినిపించింది. అయితే రోహిత్ శ‌ర్మ వేలంలోకి వస్తే మాత్రం అతను ఆల్‌టైమ్ రికార్డ్ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నాయని, రూ. 50 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్దంగా ఉన్నాయని ఓ స్పోర్ట్స్ ఛానెల్ ప్రతినిధి తెలియ‌జేశారు. మ‌రోవైపు రోహిత్ శర్మను వదులుకుంటే తమ బ్రాండ్ వాల్యూ పడిపోతుందని గ్రహించిన ముంబై ఇండియన్స్.. బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టిందని, తిరిగి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్దంగా ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

కెప్టెన్సీ మార్పును ముంబై ఇండియన్స్ జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించలేకపోయిన సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్త ప‌రిచారు. ఇక జ‌ట్టు కూడా రెండు గ్రూపులుగా విడిపోయింది. మైదానంలో ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న క‌ళ్ల‌కి క‌ట్టిన‌ట్టు క‌నిపించింది. మరోవైపు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. భారత ఆటగాడనే విషయాన్ని మరిచి ప్రతీ మ్యాచ్ లో కూడా అత‌నిని దారుణంగా ట్రోల్ చేశారు. రోహిత్ శ‌ర్మ సతమణి రితికా సజ్దే సోషల్ మీడియా వేదికగానే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తూ పోస్ట్‌లు పెట్టింది.