Viral news | పన్నెండేళ్ల బాలుడిపై మొసలి దాడి.. బాలుడి అరుపులు విన్న గొర్రెల కాపరులు ఏం చేశారంటే..!

Viral news | పశువులను మేపేందుకు నదీ తీరానికి వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసింది. బాలుడి ఎడమ చేతిని నోటకరుచుకుని నదిలోకి ఈడ్చుకెళ్లింది. బాలుడి అరుపులు విన్న గొర్రెల కాపరులు పరుగున అక్కడిక వచ్చారు. మొసలి ఈడ్చుకెళ్తున్న బాలుడిని కాపాడేందుకు నదిలోకి దిగారు.

Viral news | పన్నెండేళ్ల బాలుడిపై మొసలి దాడి.. బాలుడి అరుపులు విన్న గొర్రెల కాపరులు ఏం చేశారంటే..!

Viral news : పశువులను మేపేందుకు నదీ తీరానికి వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసింది. బాలుడి ఎడమ చేతిని నోటకరుచుకుని నదిలోకి ఈడ్చుకెళ్లింది. బాలుడి అరుపులు విన్న గొర్రెల కాపరులు పరుగున అక్కడిక వచ్చారు. మొసలి ఈడ్చుకెళ్తున్న బాలుడిని కాపాడేందుకు నదిలోకి దిగారు. ప్రాణాలు తెగించి మొసలితో పోరాడి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఉత్తప్రదేశ్‌ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలోని పేఢ్‌ గ్రామంలో భలువా బందీ నదీ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సోన్‌భద్ర జిల్లాలోని పేఢ్‌ గ్రామానికి చెందిన అజిత్ అనే వ్యక్తికి కొన్ని బర్రెలు, ఆవులు ఉన్నాయి. వాటికి గడ్డి మేపేందుకు అజిత్ కుమారుడు 12 ఏళ్ల రమేష్ రోజూ గ్రామ శివార్లలోని భలువా బందీ నదీ తీరానికి వెళుతుంటాడు. రమేశ్‌తోపాటు పలువురు గొర్రెలు, మేకలు మేపేందుకు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే పశువులను మేపేందుకు వెళ్లిన రమేశ్‌కు ఊహించని ఆపద ఎదురైంది. బురదలో మాటు వేసి ఉన్న ఓ భారీ మొసలి అతడిపై దాడి చేసింది.

రమేశ్‌ పశువులలో ఒకటి గడ్డిమేస్తూ నది సమీపానికి వెళ్లిపోయింది. ఆ పశువును తిరిగి మలుపుకొచ్చేందుకు రమేశ్‌ వెళ్లాడు. పశువు వెనక్కి తోలుకొస్తుండగా ఒడ్డున బురదలో మాటువేసి ఉన్న మొసలి బాలుడిపై అమాంతం దాడి చేసింది. ముందువైపు నుంచి రమేశ్‌ కుడి కాలును అందుకుంది. దాంతో అతడు తన ఎడమ చేతిలో ఉన్న కర్రతో దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. దాంతో మొసలి బాలుడి కాలును వదిలి చేతిని అందుకుంది. ఆ వెంటనే నదిలోకి ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టింది.

బాలుడి అరుపులు విని సమీపంలో గొర్రెలను మేపుతున్న అతని స్నేహితులు పరుగున వచ్చారు. బాలుడిని నది లోపలికి ఈడ్చుకెళ్తున్న మొసలిని ప్రాణాలకు తెగించి వెంబడించారు. అందరూ కలిసి దాన్ని బిగ్గరగా పట్టుకుని బాలుడి విడిపించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం దాన నోట్లో ప్లాస్టిక్‌ పైపు చొప్పించారు. అయినా వదలకపోవడంతో తమ దగ్గర ఉన్న కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాంతో ఆ మొసలి బాలుడిని వదిలేసి నీళ్లలోకి పారిపోయింది. ప్రస్తుతం బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.