Viral Video | గోవుల ముంగిట నెమలి నాట్యం.. వీడియో వైరల్..!
Viral Video | రెండు గోవులు పొలం గట్టున గడ్డి మేస్తున్నాయి. వాటి ముంగిట ఓ నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నది. గోవుల్లో ఒకటి ఆ నెమలిని ఎగిరిపోయేలా చేసేందుకు మీదకు ఉరికి భయపెట్టినా.. ఆ నెమలి ఎగిరిపోకుండా కొద్ది దూరం మాత్రమే జరిగి గోవును ఆటపట్టిస్తున్నది.

Viral Video : మనిషి ఎంతటి టెక్నాలజీ మత్తులో జోగుతున్నా ప్రకృతి అందాలకు దాసోహం కావాల్సిందే. ఎందుకంటే ప్రకృతి ఇచ్చినంత ఆహ్లాదాన్ని సాంకేతిక పరికరాలు ఇవ్వలేవు. పచ్చని ప్రకృతిలో ఆవులు, గేదెల మధ్య ఉండటం ఒక మధురానుభూతి. సంధ్యా సమయంలో, సాయంత్రం వేళల్లో అందమైన పక్షులు కంటికి ఇంపునిస్తాయి. వాటి కిలకిలారావాలు శ్రవణానందాలను కలుగజేస్తాయి. నెమలి నాట్యం నయనానందాన్ని కలుగజేస్తుంది.
ఒకప్పుడు పల్లెల్లో అడుగడుగునా ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాలు ఇప్పుడు అరుదైనవిగా మారిపోయాయి. పంటచేలపై పురుగుల మందులు, అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, పల్లెల్లో సైతం సాగు విస్తీర్ణం పెరిగి వృక్ష సంపద తొలగింపు వెరసి ఇప్పటికే అందమైన పక్షి జాతులు ఎన్నో అంతరించిపోయాయి. ఇలాంటి రోజుల్లో కూడా ఓ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గోవుల ముందు నెమలి చేసిన నాట్యం చేస్తున్న వీడియో చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోను cowsblike అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశారు. ఆ వీడియోలో రెండు గోవులు పొలం గట్టున గడ్డి మేస్తున్నాయి. వాటి ముంగిట ఓ నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నది. గోవుల్లో ఒకటి ఆ నెమలిని ఎగిరిపోయేలా చేసేందుకు మీదకు ఉరికి భయపెట్టినా.. ఆ నెమలి ఎగిరిపోకుండా కొద్ది దూరం మాత్రమే జరిగి గోవును ఆటపట్టిస్తున్నది. ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్‌లకు ఆహ్లాదాన్ని పంచుతోంది. మరి ఈ అందమైన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 1.14 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఏకంగా 21 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. అంతేగాక ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘ద్వాపర యుగాన్ని తలపిస్తోంది’ అని ఒకరు.. ‘కళ్ళు మూసుకుని, శ్రీ కృష్ణుడు తన వేణువును వాయిస్తున్నట్లు భావించవచ్చు అని ఇంకొకరు.. ‘ఎంతో రమణీయ దృశ్యం’ అని మరొకరు.. ‘అద్భుతమైన వీడియో’ అంటూ ఒకరు కామెంట్లు చేశారు.