Revenge | ఇదేం ప్రతీకారంరా బాబూ.. టీచర్‌పై పగతో బడిని కొని కూలగొట్టిన నటుడు..!

Revenge | చిన్నప్పుడు స్కూల్‌లో కొట్టిన టీచర్‌పై పగతో ఓ నటుడు వింత పద్ధతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడైనా కూడా అతనిలో ఆ టీచర్‌పై పగ తగ్గలేదు. టీచర్‌పై పగ తీర్చుకోవడం కోసం ఏకంగా ఆ టీచర్‌ పనిచేస్తున్న స్కూల్‌నే కొనుగోలు చేశాడు. అనంతరం దాన్ని కూల్చేశాడు. టర్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Revenge | ఇదేం ప్రతీకారంరా బాబూ.. టీచర్‌పై పగతో బడిని కొని కూలగొట్టిన నటుడు..!

Revenge : చిన్నప్పుడు స్కూల్‌లో కొట్టిన టీచర్‌పై పగతో ఓ నటుడు వింత పద్ధతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడైనా కూడా అతనిలో ఆ టీచర్‌పై పగ తగ్గలేదు. టీచర్‌పై పగ తీర్చుకోవడం కోసం ఏకంగా ఆ టీచర్‌ పనిచేస్తున్న స్కూల్‌నే కొనుగోలు చేశాడు. అనంతరం దాన్ని కూల్చేశాడు. టర్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. టర్కీకి చెందిన ప్రముఖ నటుడు కగ్లర్ ఎర్తుగ్రుల్ చిన్నప్పుడు ఎలిమెంట్రీ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఓ టీచర్ అతడిని బాగా కొట్టేవారట. ఆ తర్వాత పెరిగి పెద్దవాడయ్యాక కూడా కగ్లర్‌ ఆ దెబ్బలను మర్చిపోలేదు. యాక్టర్‌గా మంచి ఫేమ్, క్రేజ్ సంపాదించాడు. డబ్బులను కూడా బాగానే ఆర్జించాడు. అయినా చిన్ననాటి టీచర్‌పై పగ తగ్గలేదు. దాంతో ఆ టీచర్‌పై రివెంజ్ తీర్చుకోవాలని భావించాడు.

తనను కొట్టిన టీచర్‌ పనిచేస్తున్న స్కూల్‌ను కొనుగోలు చేశాడు. అంతటితో ఆగక ఆ స్కూల్‌ భవనాన్ని కూల్చేశాడు. దాంతో తన ప్రతీకారం తీరిందని అతనే స్వయంగా ప్రకటించాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇదేం రివేంజ్ రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

విద్యార్థుల మంచి కోసమే టీచర్లు కొడతారని, దానికి ఇలా ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటని షాకవుతున్నారు. ఆ భవనాన్ని ఏదైనా మంచి పనికి వాడుకుని ఉంటే బాగుండేదని, కూల్చివేతతో ఏం సాధించినట్టని ప్రశ్నిస్తున్నారు.