Google Pixel 9 Series | సరికొత్తగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో..! పిక్సల్ 9 సిరీస్ మోడల్‌ను లాంచ్ చేయబోతున్న గూగుల్..!
Google Pixel 9 Series | త్వరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో గూగుల్ పిక్సల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతున్నది. ఇంతకుముందెన్నడూ మోడల్ ఫోన్‌లో లేని విధంగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో ఈ స్మార్ట్ మొబైల్ లాంచ్ కాబోతున్నది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇప్పటికే ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Google Pixel 9 Series | త్వరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో గూగుల్ పిక్సల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతున్నది. ఇంతకుముందెన్నడూ మోడల్ ఫోన్‌లో లేని విధంగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో ఈ స్మార్ట్ మొబైల్ లాంచ్ కాబోతున్నది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇప్పటికే ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ సారి కొత్తగా గూగుల్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో మొబైల్‌ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తున్నది.
ఈ సిరీస్‌లో క్వాల్‌కామ్ 3డీ సోనిక్ జనరేషన్ 2 ప్రొసెసర్‌తో వస్తుందని టాక్, ఇప్పటి వరకు గూగుల్ అన్ని ఫోన్లలో స్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఉపయోగించగా.. తాజాగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వినియోగించినట్లు తెలుస్తున్నది. ఫోల్డ్ డివైస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రాబోతున్నది. గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, గూగుల్ పిక్సెల్ 9 ఫోల్డ్ మోడల్స్ ఆగస్టు 13న లాంచ్ కాబోతున్నాయి. మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఆయా మొబైల్‌ను గూగుల్ లాంచ్ చేయనున్నది. భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 13 రాత్రి 10.30 గంటలకు మొబైల్స్‌ను లాంచ్ చేయబోతున్నది.
స్మార్ట్‌ఫోన్లతో పాటు గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, పిక్సెల్ వాచ్ 3ని సైతం మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ టెన్సార్ జీ4 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. ఈ ఈవెంట్‌లోనే గూగుల్ ఏ1, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సైతం లాంచ్ కానున్నాయి. గూగుల్ ఏ1 ఫీచర్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేయనుంది. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని, సర్కిల్ టూ సెర్చ్, యాడ్ మి, స్డూడియో, స్క్రీన్ షాట్ తదితర ఏ1 ఫీచర్లు అందుబాటులో రానున్నాయి. గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో టెలీఫోటో సెన్సార్‌తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుందని తెలుస్తున్నది.