ఆపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. iPhone 14 Pro Max మొబైల్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

ఆపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. iPhone 14 Pro Max మొబైల్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

విధాత‌: ఆపిల్‌ మొబైల్స్‌ అంటే క్రేజ్‌ ఉంటుంది. ఇటీవల ఐఫోన్‌ 15 సిరీస్‌ విడుదలైంది. దీంతో స్టోర్స్‌లో జనాలు పెద్ద ఎత్తున బారులు తీరి కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో పాత మోడల్స్‌పై ఈకామర్స్‌ సైట్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ సైతం ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్‌పై భారీగా డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐ ఫోన్ 14 ప్రోమాక్స్‌ సిరీస్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మొబైల్‌ వాస్తవ ధర రూ.1,49, 900 ఉంది.


అయితే, ఈ మొబైల్‌పై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. 7శాతం తగ్గింపుతో రూ.1,39,990కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రూ.9,910 ధరను తగ్గించగా.. వర్కింగ్‌ కండిషన్‌లో ఉన్న ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంచ్‌ చేసుకుంటే రూ.37,500 వరకు ధర తగ్గనున్నది. అయితే, ప్రస్తుతం మీరు వాడుతున్న మొబైల్‌ను బట్టి ఎక్స్చేంజ్‌ ధర ఆధారపడి ఉంటుంది. అయితే, ఆఫర్‌ రేటు సైతం ఒక్కో ప్రాంతానికి ఒక్కో మారుతున్నది.


పిన్‌కోడ్‌ను బట్టి ఎంత ధర ఎక్స్ఛేంజ్‌ వాల్యూను తెలుసుకోవచ్చు. ఇక ఐఫోన్‌ 14 మ్యాక్స్‌ ప్రో ఫీచర్స్‌ విషయానికి వస్తే 2796×1290 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో అద్భుతమైన 6.70-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఏ 16 బయోనిక్ ప్రాసెసర్ ఉండగా.. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది. వెనుక వైపు 48 ఎంపీ, 12 ఎంపీ, 12 ఎంపీ లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెంటప్‌ ఉంటుంది. మరో వైపు ఇప్పటికే ఐఫోన్‌ 13, 12 సిరీస్‌ మోడల్స్‌పై సైతం డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి.