Voyager 1 | ఈ అనంత విశ్వంలోని రహస్యాల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 1977 వోయేజర్–1 స్పేస్‌షిప్‌లో నింగిలోకి పంపింది. ఇప్పటి వరకు భూమిపైకి ఎంతో విలువైన సమాచారాన్ని పంపింది. గత కొద్దిరోజుల కిందట వోయేజర్ స్పేస్‌క్రాఫ్ట్ భూమిపైకి సందేశాలను పంపడం ఆపివేసింది.
Voyager 1 | ఈ అనంత విశ్వంలోని రహస్యాల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 1977 వోయేజర్–1 స్పేస్‌షిప్‌లో నింగిలోకి పంపింది. ఇప్పటి వరకు భూమిపైకి ఎంతో విలువైన సమాచారాన్ని పంపింది. గత కొద్దిరోజుల కిందట వోయేజర్ స్పేస్‌క్రాఫ్ట్ భూమిపైకి సందేశాలను పంపడం ఆపివేసింది. తాజాగా మళ్లీ స్పందించింది. భూమికి దాదాపు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో నుంచి ‘హాయ్ నేను వీ1’ అంటూ నాసా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌కు సందేశాన్ని పంపింది. ఈ విషయాన్ని నాసా వోయేజర్–1 ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. గత 46 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వోయేజర్–1 2023 నవంబర్ 14 తర్వాత కంట్రోల్ సెంటర్‌కు సమాచారం పంపడాన్ని నిలిపివేసింది.
కానీ, స్పేస్ షిప్ కంట్రోల్స్ నుంచి ఆదేశాలను స్వీకరిస్తూనే ఉంది. వోయేజర్–1లోని ఒక మెమొరీ చిప్ సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ బృందాలు 2023 మార్చిలో గుర్తించాయి. ఆ చిప్‌ను కోడింగ్ ద్వారా సరి చేశారు. ఆ తర్వాత తిరిగి సమాచారాన్ని పంపండం ప్రారంభించింది. ‘వోయేజర్–1 కీలక డేటాను తిరిగి పపంపుతున్నది. ప్రస్తుత పనితీరు గురించి వివరించడంతోపాటు అందులోని పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో సమాచారం నాసాకు పంపింది. ఇకపై స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన సైన్స్ డేటాను పంపేలా చేస్తామని నాసా పేర్కొంది. వోయేజర్–1 స్పేస్‌క్రాఫ్ట్ 2012లో ఇంటర్ స్టెల్లార్ మీడియం (నక్షత్రాల మధ్య ఉండే ప్రదేశం)లోకి వెళ్లింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత స్పేస్‌క్రాఫ్ట్‌గా ఘనత సాధించింది. ప్రస్తుతం వోయేజర్–1 భూమికి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భూమి నుంచి పంపే సందేశాలు వోయేజర్–1కు చేరడానికి ఏకంగా 22.5 గంటల సమయం పడుతుందని నాసా పేర్కొంది.
వోయేజర్–1 తర్వాత 1977లోనే నాసా ప్రయోగించిన వోయేజర్–2 సైతం 2018లో మన సౌర వ్యవస్థను దాటి ముందుకు సాగుతున్నది. రెండు వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్‌లలో ‘గోల్డెన్ రికార్డ్స్’ ఉన్నాయి. మన ప్రపంచం తాలూకు కథను గ్రహాంతరవాసులకు తెలిపేందుకు వీలుగా బంగారు పూత పూసిన 12 అంగుళాల రాగి డిస్క్‌లను వాటిలో ఏర్పాటు చేశారు. ఆ డిస్క్‌లలో మన సౌర వ్యవస్థ మ్యాప్, స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణ ప్రారంభ తేదీని గ్రహాంతరవాసులు ఎవరైనా తెలుసుకొనేలా రేడియోధార్మికతగల గడియారం, ఆ డిస్క్‌లను ఎలా ఆన్ చేయాలో సూచించే చిహ్నాలతో కూడిన సందేశాలు పొందుపరిచారు. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్‌లలోని పవర్ బ్యాంకులు 2025 తర్వాత ఎప్పుడైనా పని చేయకుండాపోయే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వోయేజర్లు స్పేస్‌క్రాఫ్ట్స్ నిశ్శబ్ధంగా తమ ప్రయాణాన్ని సాగించనున్నాయి.