Translate Messages On WhatsApp | వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..నచ్చిన భాషలో మెసేజ్ లు

వాట్సాప్‌లో కొత్త ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌.. నచ్చిన భాషలో మెసేజ్‌లను చదివే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.

Translate Messages On WhatsApp | వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..నచ్చిన భాషలో మెసేజ్ లు

విధాత : సెల్ ఫోన్ వినియోగంతో విప్లవాత్మక మార్పుకు కారణమైన వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. కొత్తగా మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇదివరకే వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలో అందించే సదుపాయం ఉండగా.. తాజాగా మెసేజ్‌లను నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇతర భాషలలోని మెసేజ్ లను … వాళ్లకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవ‌చ్చు. మెటా తీసుకువచ్చిన కొత్త ఫీచర్ మెసేజ్ ట్రాన్స్ లేషన్. అంటే మనకు హిందీలో వచ్చిన మెసేజ్ ను.. సులభంగా తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరి సహాయం లేకుండా.. ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ ఫీచర్ అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఐఓఎస్ లో మొత్తం 19 భాషలను ట్రాన్స్ లేట్ చేయగలదు ఈ ఫీచర్. ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్ హిందీ భాషలకు ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది.

వాట్సాప్‌ లో వచ్చిన సందేశాన్ని ట్రాన్స్‌లేట్‌ చేయాలనుకుంటే.. దానిపై లాంగ్ ప్రెస్ చేయాలి. అనంతరం మనకు ట్రాన్స్‌లేట్‌ ఫీచర్ కనిపిస్తుంది. అప్పుడు నచ్చిన భాష లోకి…ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ లో కావాలంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌లేట్‌ ఫీచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతి సందేశం ఆటోమేటిగ్గా ట్రాన్స్‌లేట్‌ అవుతుంది. ఇటీవల చాటింగ్, గోప్యతా నిబంధనలను మరింత కఠినం చేసేందుకు వాట్సాప్ కీలకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు పంపించిన ఫోటోలు, వీడియోలు మొదలైన మీడియా ఫైల్స్ స్వయంగా వేరే వారి గ్యాలరీలో సేవ్ అవకుండా చేయనుంది. ఇది వినియోగదారుల ప్రైవేట్ చాటింగ్, వీడియోలు, చిత్రాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.