మైలారంలో 200పరిశ్రమలు రాబోతున్నాయి :మంత్రి శ్రీధర్‌బాబు

భూపాలపల్లి జిల్లా మైలారం ఇండస్ట్రీయల్ పార్కు ద్వారా ఈ ప్రాంతంలో 200 పరిశ్రమలు రాబోతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు

మైలారంలో 200పరిశ్రమలు రాబోతున్నాయి :మంత్రి శ్రీధర్‌బాబు

ఇండిస్ట్రీయల్ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

విధాత, హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లా మైలారం ఇండస్ట్రీయల్ పార్కు ద్వారా ఈ ప్రాంతంలో 200 పరిశ్రమలు రాబోతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో గాంధీ నగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్ కు మంత్రులు పొంగులేటి, సీతక్కలతో కలిసి శ్రీధర్‌బాబలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మైలారం ఇండస్ట్రీయల్ పార్కుకు 60 ఎకరాల కేటాయించామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతం భూపాలపల్లిని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంత యువతకు పరిశ్రమల రాకతో భవిష్యత్తులో స్థానిక ఉద్యోగ, ఉపాధి అవకాశలు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయం రంగం సంక్షేమానికి 2లక్షల రైతు రుణమాఫీ చేసిందన్నారు. ఇంకోవైపు పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ కోసం చర్యలు చేపట్టిందన్నారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిశ్రమలను జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా పట్టణాలకు వలసలను నివారించి స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.