వాగులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ముగ్గురు మృతి

విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కుర్ గ్రామంలో ట్రాక్టర్ వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలివి. కొల్కురు గ్రామం నుండి సదాశివ పేటకు వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాద వశాత్తూ వాగులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మంగలి గోపాల్ (30), ఈటెల రమణ (45), ఏ మల్లేష్ (30) మృత్యువాత పడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.