నా సంపదలో 70శాతం ఫౌండేషన్ కోసమే: డాక్టర్ కంచర్ల రవీంద్రనాథ్
విధాత,హైదరాబాద్ : తన సంపదలో 70శాతం (రూ.350కోట్లు) లాభాపేక్ష రహిత ప్రపంచస్థాయి మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు కోసం వెచ్చించనున్నట్టు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రవీంద్రనాథ్ ప్రకటించారు. గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్‌లో ఆ మొత్తంతో మెడికల్ విశ్వవిద్యాలయం, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ఇవాళ వెల్లడించారు. 750-1000 పడకలతో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటానికి రూ.700 కోట్లు, 7 సంవత్సరాల వ్యవధి, మానవ వనరులు […]

విధాత,హైదరాబాద్ : తన సంపదలో 70శాతం (రూ.350కోట్లు) లాభాపేక్ష రహిత ప్రపంచస్థాయి మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు కోసం వెచ్చించనున్నట్టు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రవీంద్రనాథ్ ప్రకటించారు. గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్‌లో ఆ మొత్తంతో మెడికల్ విశ్వవిద్యాలయం, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ఇవాళ వెల్లడించారు. 750-1000 పడకలతో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటానికి రూ.700 కోట్లు, 7 సంవత్సరాల వ్యవధి, మానవ వనరులు అవసరమవుతాయని ఫౌండేషన్ వెల్లడించింది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను అవసరానికి అనుగుణంగా అభివృద్ధి పర్చుకోవచ్చని, వైద్య చికిత్స ఖర్చులను తగ్గించేందుకు ఉపయోగపడే పరిశోధనలు చేయనున్నట్టు రవీంద్రనాథ్ తెలిపారు.