ఈనెల 13న కరీంనగర్‌లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్

విదేశాల్లో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించి వైద్యులుగా స్థిరపడాలని కోరుకునే విద్యార్థులకు జియో 7 ఫ్లై సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13న కరీంనగర్ లో "అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్" సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ముకర్రం మహమ్మద్ తెలిపారు

ఈనెల 13న కరీంనగర్‌లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్

  • విద్యార్థులు ఈసదవకాశాన్ని వినియోగించుకోండి
  • జియో7 ఫ్లై సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ముకర్రం మహమ్మద్
  • విధాత బ్యూరో, కరీంనగర్: విదేశాల్లో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించి వైద్యులుగా స్థిరపడాలని కోరుకునే ఔత్సాహిక విద్యార్థులకు జియో 7 ఫ్లై సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 13న కరీంనగర్ పట్టణంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో “అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్” సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ముకర్రం మహమ్మద్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ సెమినార్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

    యూఎస్, యూకే, కెనడా, జార్జియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలోని ప్రముఖ పేరొందిన యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సెమినార్‌కు హాజరవుతున్నారని చెప్పారు. కరీంనగర్ చరిత్రలో విదేశీ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు నేరుగా ఇలాంటి సెమినార్‌కు రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.

    సెమినార్ కాగానే విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ సౌకర్యం ఉంటుందని, వారు అంతర్జాతీయ స్కాలర్‌షిప్ నాలుగు లక్షల వరకు, తెలంగాణ ప్రభుత్వ విదేశీ విద్య స్కాలర్‌షిప్ 20 లక్షల వరకు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎంబీబీఎస్‌ చదవాలనుకునే విద్యార్థుల ప్రవేశాలకు కోసం జార్జియాలోని ప్రముఖ ప్రభుత్వ యూనివర్సిటీ “ఎస్ఈయు” ప్రతినిధులు ఈ సెమినార్ కు హాజరవుతున్నారని చెప్పారు.

    నీట్ ఉత్తీర్ణులు అయిన వారు, నీట్ ఉత్తీర్ణులు కాని వారికి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ దొరుకుతుందన్నారు. ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులకు జార్జియా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలో ఒక ఏడాదికి రూ.4.50 లక్షలు మాత్రమే ఉందని, ఇంటర్ లో 82% పైగా ఉత్తీర్ణులైన వారికి ఒక సంవత్సరం పాటు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని, ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు 15వందల యుఎస్ డాలర్ల మెడికల్ కిట్ లేదా ల్యాప్ టాప్ ఉచితంగా అందిస్తున్నామన్నారు.

    కెనడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కు సంబంధించి, కెనడాలోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందం వస్తుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించాలనే తపన కలిగిన విద్యార్థులు ఈ సెమినార్ కు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు హాజరయ్యే వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని చెప్పారు. మరిన్ని వివరాలకు కింది ఫోన్ నెంబర్లలో 8818810711 సంప్రదించాలని సూచించారు.