ఈటెలకు మద్దతుగా అచ్చంపేట రైతులు, బీసీ సంఘాలు
*స్వచ్ఛందంగా భూములు అమ్ముకున్నాం- అచ్చంపేట రైతు పోచయ్య*ఆరోపణలు బాధాకరం- హుజురాబాద్ చైర్‌పర్సన్ రాధిక ఈటెల మచ్చలేని మనిషి- అచ్చంపేట రైతులు*డబ్బులిచ్చి కొంతమందితో అబద్ధాలు చెప్పించారు…*ప్రజలెవ్వరూ నమ్మడం లేదు ఎవరు వెనకుండి నడిపించారో త్వరలో బయటపడ్తుంది- రైతులు*సోషల్ మీడియాలో ఈటెలకు పెద్ద ఎత్తున మద్దతు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ భూముల వ్యవహారం పక్కా ప్లాన్‌గా ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని తెలుస్తోందని అచ్చంపేట రైతులు చెబుతున్నారు. మేము స్వచ్ఛందంగానే ఈటెలకు భూమిని అమ్ముకున్నామని…ఎవరూ ఆక్రమించడంగానీ, గుంజుకోవడం లేదని చెబుతున్నారు. […]

*స్వచ్ఛందంగా భూములు అమ్ముకున్నాం- అచ్చంపేట రైతు పోచయ్య
*ఆరోపణలు బాధాకరం- హుజురాబాద్ చైర్‌పర్సన్ రాధిక
- ఈటెల మచ్చలేని మనిషి- అచ్చంపేట రైతులు
*డబ్బులిచ్చి కొంతమందితో అబద్ధాలు చెప్పించారు…
*ప్రజలెవ్వరూ నమ్మడం లేదు - ఎవరు వెనకుండి నడిపించారో త్వరలో బయటపడ్తుంది- రైతులు
*సోషల్ మీడియాలో ఈటెలకు పెద్ద ఎత్తున మద్దతు
తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ భూముల వ్యవహారం పక్కా ప్లాన్‌గా ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని తెలుస్తోందని అచ్చంపేట రైతులు చెబుతున్నారు. మేము స్వచ్ఛందంగానే ఈటెలకు భూమిని అమ్ముకున్నామని…ఎవరూ ఆక్రమించడంగానీ, గుంజుకోవడం లేదని చెబుతున్నారు. ఈటెల మాకు ఎలాంటి అన్యాయం చేయలేదని అచ్చంపేట రైతు పోచయ్య చెప్పారు. పైగా మా ఊర్లో పెద్దమ్మ గుడి కట్టడానికి డబ్బు సాయం చేసిండని, అనేకసార్లు వారి ఇంటికి వెళితే అన్నం తినకుండా పంపడని చెప్పారు.
ఈటెల రాజేందర్ మచ్చలేని మనిషి అని… డబ్బులిచ్చి కొంతమందితో ఈటెలపై అబద్ధాలు చెప్పించారని హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధిక అన్నారు. ఈటెలపై వచ్చిన ఆరోపణలు ఎవరో పనిగట్టకుని చేస్తున్నారని, ఏదిపడితే అది నమ్మడానికి తెలంగాణ ప్రజలు గొర్లు కాదన్నారు. ఇక అచ్చంపేట రైతుల సైతం ఈటెలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను ఖండిస్తున్నారు. వెనుక ఎవరో ప్రలోభపెట్టి చెప్పిన అబద్ధాలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. అది ఎవరో త్వరలో బయటపడ్తుందన్నారు. ఈటెల టార్గెట్‌గా జరుగుతున్న కుట్రను తెలంగాణ బీసీ సంఘాలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి.
బీసీలపై జరిగిన కుట్రగా అభివర్ణిస్తున్నా బీసీ నేతలు ఈటెలకు మద్దతుగా పలుచోట్ల ప్రెస్‌మీట్లు పెట్టారు. సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే పలువురు బీసీ సంఘాల నాయకులు ఈటెలను స్వయంగా కలిసి మద్దతు ప్రకటించారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు
ఈటెల వ్యవహారంలో సోషల్ మీడియా అయిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వేదికల్లోనూ యూ ట్యూబ్‌లోనూ పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. కేసీఆర్ ఈటెలను టార్గెట్ చేసే ఈ కుంభకోణం ఆరోపణలు చేయించారని కామెంట్లు పెడుతున్నారు. కేసీఆర్ ఆఘమేఘాల మీద విచారణకు ఆదేశించడం, ఆరోగ్యశాఖను తనకు కేటాయించుకోవడం చూస్తే ఇది ఎవరి స్కెచ్చో తెలిసిపోయిందంటున్నారు.
కేసీఆర్ అంత నిజాయితీపరుడైతే మంత్రి మల్లారెడ్డిమీద వచ్చిన ఆరోపణలు మాటేంటని, కేసీఆర్ ఫాం హౌస్ కబ్జాల కథేంటని, మై హోం రామేశ్వరరావు హైదరాబాద్ చుట్టూ వందల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నల పరంపర వెల్లువెత్తుతోంది.
బిజిపి, కాంగ్రెస్‌లు కూడా…
ఈటెల భూకబ్జాల మీద ఆఘమేఘాల మీద స్పందించిన కేసీఆర్‌ను కాంగ్రెస్, బిజేపీ నేతలు కూడా కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, బిజేపీ నేతలు అరవింద్ ధర్మపురి, బండి సంజయ్‌లు కేసీఆర్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. మై హోం రామేశ్వరరావు, మంత్రి మల్లారెడ్డి, ఇతర టిఆర్ ఎస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై ఇదే స్పీడులో కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.