ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు విస్తృత ప్రచారం చేపట్టారు
విధాత : ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఖమ్మం పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో రఘురామిరెడ్డి కోడలు హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత పాల్గొన్నారు. రఘురామిరెడ్డి గెలిస్తే.. నియోజకవర్గ అభివృద్ధికి ఏమేమి చేస్తారనే విషయాలను ఆశ్రిత వివరించారు.
మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆశ్రిత పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఐదేళ్లుగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు ఎంత ఖర్చు చేశారు చెప్పాలంటూ ఆశ్రిత ప్రశ్నించారు. మామ రఘురామిరెడ్డి గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి ముందుకెలుతుందని భరోసానిచ్చారు.