కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు.. తిరుగుబాట్లు

కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు.. తిరుగుబాట్లు
  • జూబ్లీహిల్స్ నేత పి. విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా


విధాత : కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన అనంతరం టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి వెళ్ళగక్కుతూ రచ్చకెక్కుతున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ అగ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. మరికొందరు పార్టీకి రాజీనామా చేస్తుండగా.. ఇంకొందరు ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన పి. విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ను అజారుద్దీన్ కు ఇవ్వడంతో అసంతృప్తికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.


మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి అసమ్మతి వ్యక్తం చేశారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. చలమల్ల వర్గీయులు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, రేవంత్ ల దిష్టిబొమ్మ దహనాలకు పాల్పడ్డారు. అటు ఎన్ఎస్ యూ ఐ నేత బల్మూరు వెంకట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు సైతం తమకు కాంగ్రెస్ టికెట్లు దక్కకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిలో మునిగి పోయారు.


ఇంకోవైపు పార్టీలో చేరిన వెంటనే టికెట్లు కేటాయించడంతో గత ఐదు పదెళ్లుగా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించిన నేతలు టికెట్ దక్కకపోవడం పై అసమతి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి వలసనేతలకు టికెట్లు కేటాయించడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అటు బీసీ నేతలు తమకు తగిన సీట్లు దక్కకపోవడం పట్ల వసంతృప్తితో రగిలిపోతున్నారు మిగిలిన 19 స్థానాల్లో అసంతృప్తులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్నది తేలాల్సి ఉంది. అటు వామపక్షాలకు ఇచ్చే సీట్ల తో ఎవరి టికెట్లకు కోతపడుతుందొనన్న టెన్షన్ కాంగ్రెస్ ఆశావాహులను మరింత ఆందోళన గురిచేస్తుంది.


ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి టికెట్ ఆశించిన మేఘారెడ్డికి, దేవరకద్ర టికెట్ ఆశించిన కొండా ప్రశాంత్ రెడ్డికి, జడ్చర్ల టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్ కి నిరాశ ఎదురయింది. వారంతా తమ భవిష్యత్ కార్యాచరణ కోసం అనుచరులు మద్దతు ధరలతో భేటీ అవుతున్నారు. వనపర్తి టికెట్ ఆశించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.


పరకాల టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వడంతో ఇక్కడి నుండి టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా బోథ్ నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బిఆర్ఎస్ టికెట్ దక్కక కాంగ్రెస్లో చేరినప్పటికీ ఇక్కడ కూడా టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో పడిపోయారు ఆయన తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకునేందుకు అనుచరులు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ నేతలు జంగా రాఘవ రెడ్డి, ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చలమల్ల‌ కృష్ణారెడ్డి, ఎర్ర శేఖర్, విష్ణువర్దన్ రెడ్డి, నగేష్ రెడ్డి,‌ గండ్ర సుజాత, శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్, మానవతా రాయ్, పిడమర్తి రవి.